తెలంగాణ ప‌ట్ల కేంద్రం వివ‌క్ష త‌గ‌దు

భ‌గ్గుమ‌న్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రం ప‌ట్ల కేంద్రం స‌వ‌తిత‌ల్లి ప్రేమ క‌న‌బ‌రుస్తోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. గ‌త 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కు ఒక్క పెద్ద ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదన్నారు. దేశంలో ఉన్న 29 రాష్ట్రం లో ఇపుడిపుడే పురుడు పోసుకున్న తెలంగాణ కు కేంద్రం స‌హ‌కారం అందించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–2 చేప‌ట్టేందుకు క‌నీసం 24,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందన్నారు. దీనికి కేంద్రం 50% నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందన్నారు. మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్ట్ అభివృద్ధి నది శుద్ధి, రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కోసం కేంద్ర స‌హ‌కారం అవ‌స‌రం అన్నారు.

రీజినల్ రింగ్ రోడ్ (RRR) హైదరాబాద్ చుట్టూ 330 కి.మీ భారీ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కొంత అనుమతి వచ్చినా, దక్షిణ భాగం ఇంకా పెండింగ్ లో ఉంద‌న్నారు. హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్
పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన కారిడార్ కోసం కేంద్ర పరిశ్రమల శాఖ నుంచి పూర్తి ఆమోదం ల‌భించాల్సి ఉంద‌న్నారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో బ‌య్యారం స్టీల్ ప్లాంట్ వ‌ద్ద ఉక్కు క‌ర్మాగారం నిర్మించేందుకు ఇచ్చిన హామీ నెర‌వేర్చ లేద‌న్నారు. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 2013 లో ప్రతిపాదించిన ఐటిఐఆర్ ప్రాజెక్ట్ తెలంగాణ కు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు తెలంగాణ కు ఎందుకు ఇవ్వరంటూ భ‌గ్గుమ‌న్నారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *