నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్ జిల్లాలోని రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్ పై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పలు వివరాలను వెల్లడించారు. ఆసిఫ్ అనే యువకుడిని కత్తితో దాడి చేసిన రియాజ్ కు పెనుగులాటలో దెబ్బలు తగిలాయని అన్నారు. ఈ క్రమంలో చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి తరలించి చికిత్స అందించామని సీపీ చెప్పారు.
చికిత్స తీసుకుంటున్న క్రమంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. కానిస్టేబుల్ నుంచి గన్ను లాక్కుని ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేయడం వల్ల గత్యంతరం లేక కాల్పులు జరిపినట్లుగా సీపీ అంగీకరించారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని, లోతుగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోందని చెప్పారు.
ఇదిలా ఉండగా వాహనం చోరీ చేస్తూ షేక్ రియాజ్ పారి పోయేందుకు ప్రయత్నం చేశాడు. ఈ తరుణంలో కానిస్టేబుల్ ప్రమోద్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ తరుణంలో కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో తనను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వం తరపున భారీ నజరానా ప్రకటించారు డీజీపీ శివధర్ రెడ్డి. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేస్తారని తెలిపారు.






