పేద‌ల పాలిట శాపంగా మారిన స‌ర్కార్

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సీరియ‌స్ అయ్యారు కాంగ్రెస్ స‌ర్కార్ పై. వ‌సూళ్ల‌కు కేరాఫ్ గా మారింద‌ని, ఏ ఒక్క వ‌ర్గం ఇప్పుడు ఆశించిన మేర సంతోషంగా లేర‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేవ‌లం వ‌సూళ్ల కోసం, బెదిరించేందుకు హైడ్రాను తీసుకు వ‌చ్చార‌ని ఆరోపించారు. పేద‌ల ఇళ్ల‌ను నేల‌మ‌ట్టం చేయ‌డం త‌ప్పితే చేసింది ఏమీ లేద‌న్నారు కేటీఆర్. ఆయ‌న బాధితులకు భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు . దీపావ‌ళి పండుగ‌ను ఇక్క‌డ జ‌రుపుకున్నారు. ఉండటానికి ఇల్లు లేక, కిరాయి కట్టడానికి డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. నిరుపేదల కడుపు కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేన‌ని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఏం సహాయం చేయలేదని, అందుకే నిలువునీడ లేకుండా పోయిన నిరుపేదలతో కలిసి దీపావళి జరుపాలని నిర్ణయించు కున్నానని తెలిపారు. తాము వచ్చి హైడ్రా బాధితులతో కలిసి దీపావళి జరుపుకుంటే నైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. నిరుపేదలకు ధైర్యం చెప్పడానికే ఇక్కడికి వచ్చామని, బాధిత కుటుంబాలతో కలిసి దీపావళి జరుపుకొని, సహాయం చేయడానికి వచ్చామని స్పష్టం చేశారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి హైడ్రా బాధిత కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *