పేద‌ల పాలిట శాపంగా మారిన స‌ర్కార్

Spread the love

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సీరియ‌స్ అయ్యారు కాంగ్రెస్ స‌ర్కార్ పై. వ‌సూళ్ల‌కు కేరాఫ్ గా మారింద‌ని, ఏ ఒక్క వ‌ర్గం ఇప్పుడు ఆశించిన మేర సంతోషంగా లేర‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేవ‌లం వ‌సూళ్ల కోసం, బెదిరించేందుకు హైడ్రాను తీసుకు వ‌చ్చార‌ని ఆరోపించారు. పేద‌ల ఇళ్ల‌ను నేల‌మ‌ట్టం చేయ‌డం త‌ప్పితే చేసింది ఏమీ లేద‌న్నారు కేటీఆర్. ఆయ‌న బాధితులకు భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు . దీపావ‌ళి పండుగ‌ను ఇక్క‌డ జ‌రుపుకున్నారు. ఉండటానికి ఇల్లు లేక, కిరాయి కట్టడానికి డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. నిరుపేదల కడుపు కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేన‌ని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఏం సహాయం చేయలేదని, అందుకే నిలువునీడ లేకుండా పోయిన నిరుపేదలతో కలిసి దీపావళి జరుపాలని నిర్ణయించు కున్నానని తెలిపారు. తాము వచ్చి హైడ్రా బాధితులతో కలిసి దీపావళి జరుపుకుంటే నైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. నిరుపేదలకు ధైర్యం చెప్పడానికే ఇక్కడికి వచ్చామని, బాధిత కుటుంబాలతో కలిసి దీపావళి జరుపుకొని, సహాయం చేయడానికి వచ్చామని స్పష్టం చేశారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి హైడ్రా బాధిత కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు.

  • Related Posts

    బీజేపీ అంటే బాబు..జ‌గ‌న్..ప‌వ‌న్

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన ష‌ర్మిలా రెడ్డి అమ‌రావ‌తి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో BJP అంటే బాబు-జగన్-పవన్ అంటూ ఎద్దేవా చేశారు. ముగ్గురు బీజేపీకి బానిసలేన‌ని ఆరోపించారు. స్వార్థ రాజకీయాలు…

    ఆక్ర‌మ‌ణ‌ల నుంచి చెరువుల‌ను కాపాడుకోవాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ఆక్ర‌మ‌ణ‌ల నుంచి చెరువుల‌ను కాపాడు కోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరించుకున్న కూకట్ పల్లి లోని నల్ల చెరువును ప్రారంభించడం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *