జూబ్లీ హిల్స్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీత‌క్క బిజీ

Spread the love

కాంగ్రెస్ అభ్య‌ర్థి భారీ మెజారిటీతో గెల‌వ‌డం ఖాయం

హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్దం మొద‌లైంది. నువ్వా నేనా అన్న రీతిలో ఆయా పార్టీల‌కు చెందిన నేత‌లు, స్టార్ క్యాంపెయిన‌ర్లు రంగంలోకి దిగారు. ఇప్ప‌టికే ముందంజ‌లో కొన‌సాగుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి సునీత‌. ఆమెకు అండ‌గా రంగంలోకి దిగారు మాజీ మంత్రులు, బావ బామ్మ‌ర్థులు కేటీఆర్, హ‌రీశ్ రావు. మ‌రో వైపు లేట్ గా ప్ర‌క‌టించింది బీజేపీ త‌మ అభ్య‌ర్థిని. త‌మ పార్టీ త‌ర‌పున వ్యాపార‌వేత్త లంకాల దిలీప్ రెడ్డిని ఖ‌రారు చేసింది.
ఇక కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున న‌వీన్ యాద‌వ్ ను బ‌రిలోకి దిగింది. ఇక్క‌డ ముస్లిం, పేద‌ల ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్నాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు.

మ‌రో వైపు బుధవారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో హోరెత్తించారు మంత్రి సీత‌క్క‌. త‌ను వినూత్నంగా ప్ర‌చారం చేప‌ట్టారు. ఓట‌ర్ల‌లో జోష్ నింపే ప్ర‌య‌త్నం చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా టిఫిన్లు వడ్డిస్తూ, బట్టలు ఐరన్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు మంత్రి . ఈ సంద‌ర్బంగా ఆమె ఓట‌ర్ల‌తో సంభాషించారు. తాము అన్ని వర్గాల‌ను ఆకట్టుకునేలా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌న్నారు. త‌మ అభ్య‌ర్థి గెల‌వ‌డం ప‌క్కా అని అన్నారు.

  • Related Posts

    సీఎం రేవంత్ రెడ్డివ‌న్నీ ప‌చ్చి అబ‌ద్దాలు

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్. ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. ప‌దే ప‌దే అబ‌ద్దాలు…

    ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్న జ‌గ‌న్ : ర‌వికుమార్

    Spread the love

    Spread the loveమాజీ ముఖ్య‌మంత్రిపై మంత్రి గొట్టిపాటి షాకింగ్ కామెంట్స్ అమ‌రావ‌తి : మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, ప‌ల్నాడు జిల్లా ఇంచార్జి గొట్టిపాటి ర‌వికుమార్. ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు తెర లేపాడ‌ని, లా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *