సీ ఫుడ్ కు ఆస్ట్రేలియా స‌హ‌క‌రించాలి


ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్

అస్ట్రేలియా : సీ ఫుడ్ కు ఆస్ట్రేలియా స‌ర్కార్ స‌హ‌క‌రించాల‌ని కోరారు ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. సీఫుడ్ వాణిజ్యంలో ఆస్ట్రేలియాతో భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడం గురించి గత రెండు రోజులుగా తాను చర్చలు జరుపుతూ వ‌చ్చార . ఈరోజు స్థిరమైన ఆక్వా కల్చర్ ట్రేడ్ నెట్‌వర్కింగ్‌లో భాగస్వామ్యాలను చర్చించడానికి సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా (SIA) CEO వెరోనికా పాపాకోస్టా మరియు ఎంగేజ్‌మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లెహెర్‌లను కలిశారు. 2024–25లో USD 7.4 బిలియన్లు (₹66,000 కోట్లు) విలువైన భారతదేశ సముద్ర ఆహార ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ 60%+ వాటాను కలిగి ఉందన్నారు. ఆస్ట్రేలియన్ సముద్ర ఆహారాన్ని ప్రోత్సహించడానికి, దానిని ప్రీమియం సమర్పణగా మార్చడానికి వారు ‘గ్రేట్ ఆస్ట్రేలియన్ సీఫుడ్’ అనే బ్రాండ్‌ను సృష్టించారని తెలిపారు.

ఈ సంద‌ర్బంగా శిక్ష‌ణ , మార్కెటింగ్ స‌దుపాయాలు కూడా క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు మంత్రి నారా లోకేష్. రొయ్య‌ల ప‌రంగా పెద్ద ఎత్తున వ్యాపార‌, వాణిజ్యం కొన‌సాగుతోంద‌ని చెప్పారు. ప్ర‌ధానంగా అత్య‌ధికంగా ఆదాయ వ‌న‌రుగా ఇది మారింద‌న్నారు. స‌ర్కార్ అన్ని ర‌కాలుగా స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తోంద‌ని తెలిపారు మంత్రి. కాగా సుంకాల విధింపు కార‌ణంగా ఎక్కువ‌గా రొయ్య‌ల ఇండ‌స్ట్రీపై అత్య‌ధికంగా ప్ర‌భావం చూపిస్తోంద‌న్నారు నారా లోకేష్‌.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *