ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
అస్ట్రేలియా : సీ ఫుడ్ కు ఆస్ట్రేలియా సర్కార్ సహకరించాలని కోరారు ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. సీఫుడ్ వాణిజ్యంలో ఆస్ట్రేలియాతో భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడం గురించి గత రెండు రోజులుగా తాను చర్చలు జరుపుతూ వచ్చార . ఈరోజు స్థిరమైన ఆక్వా కల్చర్ ట్రేడ్ నెట్‌వర్కింగ్‌లో భాగస్వామ్యాలను చర్చించడానికి సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా (SIA) CEO వెరోనికా పాపాకోస్టా మరియు ఎంగేజ్‌మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లెహెర్‌లను కలిశారు. 2024–25లో USD 7.4 బిలియన్లు (₹66,000 కోట్లు) విలువైన భారతదేశ సముద్ర ఆహార ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ 60%+ వాటాను కలిగి ఉందన్నారు. ఆస్ట్రేలియన్ సముద్ర ఆహారాన్ని ప్రోత్సహించడానికి, దానిని ప్రీమియం సమర్పణగా మార్చడానికి వారు ‘గ్రేట్ ఆస్ట్రేలియన్ సీఫుడ్’ అనే బ్రాండ్‌ను సృష్టించారని తెలిపారు.
ఈ సందర్బంగా శిక్షణ , మార్కెటింగ్ సదుపాయాలు కూడా కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు మంత్రి నారా లోకేష్. రొయ్యల పరంగా పెద్ద ఎత్తున వ్యాపార, వాణిజ్యం కొనసాగుతోందని చెప్పారు. ప్రధానంగా అత్యధికంగా ఆదాయ వనరుగా ఇది మారిందన్నారు. సర్కార్ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తోందని తెలిపారు మంత్రి. కాగా సుంకాల విధింపు కారణంగా ఎక్కువగా రొయ్యల ఇండస్ట్రీపై అత్యధికంగా ప్రభావం చూపిస్తోందన్నారు నారా లోకేష్.






