ఏపీ మీడియా అకాడమీని బ‌లోపేతం చేయాలి

స‌మాచార సంచాల‌కుల‌ను కోరిన ఏపీయూడ‌బ్ల్యూజే

విజ‌య‌వాడ : ఇబ్బందుల్లో ఉన్న పాత్రికేయులను ఆదుకునేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ను పటిష్టం చేయాల‌ని ఏపీ స‌మాచార శాఖ సంచాల‌కులు విశ్వ‌నాథ‌న్ ను కోరారు ఏపీయూడ‌బ్ల్యూజే నేత‌లు కోరారు. అవసరమైన బడ్జెట్ లు కేటాయించాలని విన్న‌వించారు. అకాడమీ నియమావళి ప్రకారం వివిధ కార్యకలాపాలు చేపట్టడానికి వీలుగా గవర్నింగ్ కౌన్సిల్, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో నియమించాలని విన్నవించారు. వృత్తిలో ప్రతిభ కనబరిచిన పాత్రికేయులకు, ఫోటో జర్నలిస్టులను, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందిని ప్రోత్సహించేందుకు వీలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసి ఈమధ్య నిలిపివేసిన రాష్ట్రస్థాయి ఉత్తమ జర్నలిస్టు పురస్కార ప్రధాన కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని కోరారు . అలాగే సుదీర్ఘకాలం వృత్తిలో సేవలు అందించిన సీనియర్ పాత్రికేయులను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించే ఆన‌వాయితీని తిరిగి ప్రారంభించాలని అన్నారు.

పాత్రికేయ వృత్తిలో శిక్షణ నైపుణ్యం పెంపొందించు కోవడానికి వీలుగా ఉన్నత విద్యాభ్యాసానికి వృత్తి పరికరాలు కొనుగోలు చేసుకోవడానికి తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయాలని సంచాలకులను విజ్ఞప్తి చేశారు. వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ కార్డుల పథకాన్ని పటిష్టంగా అమలు చేయడానికి, పథకం అమలను పర్యవేక్షించడానికి వీలుగా సమాచార శాఖ , ఆరోగ్యశ్రీ ట్రస్ట్, జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులతో ఒక త్రైపాక్షగా కమిటీని నియమించాలని సూచించారు. 2016లో ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలు చేసి గత ప్రభుత్వం నిలిపివేసిన వర్కింగ్ జర్నలిస్ట్ ప్రమాద బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కోరారు . వర్కింగ్ జర్నలిస్టులు, నాన్ జర్నలిస్ట్ కేటగిరీల సిబ్బందికి వేజ్ బోర్డు సిఫారసుల ప్రకారం వేతనాలు అమలు చేయడానికి వీలుగా కార్మిక శాఖ ద్వారా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు.

వేజ్ బోర్డు సిఫార్సులు పర్యవేక్షించడానికి చట్ట ప్రకారం గతంలో మాదిరిగా త్రైపాక్షగా కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపైన, మీడియా సంస్థలపైన దాడులు అరికట్టడానికి మహారాష్ట్ర తరహాలో మన రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేక చట్టాన్ని తేవాలని విన్నవించారు. కరోనా కాలంలో రద్దయిన జర్నలిస్టుల రైల్వే రాయితీ ప్రయాణ సదుపాయాన్ని పునరుద్ధరించదానికి కేంద్రంతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు .చిన్న, మధ్య తరహా పత్రికల మనుగడ కొనసాగటానికి వీలుగా ఆయా సంస్థలకు రొటేషన్ పద్ధతి పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రచార ప్రకటనలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు . దేశంలో పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధంగా వయోభారంతో వృత్తి నుండి విరమించుకున్న వయోధిక పాత్రికేయులకు పింఛన్ సదుపాయాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *