నేనెప్పుడూ గుండాయిజం చేయ‌లేదు

Spread the love

మాజీ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి కామెంట్స్

వ‌రంగ‌ల్ జిల్లా : మాజీ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఎప్పుడూ , ఎన్న‌డూ గూండాయిజం చేయ‌లేద‌న్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. క‌బ్జాల‌కు పాల్ప‌డ‌లేద‌ని, బెదిరించ లేద‌ని, వ‌సూళ్ల‌కు పాల్ప‌డ లేద‌ని ఆరోపించారు. మంత్రి కొండా సురేఖ రెడ్డి కథ సుఖాంతం అయ్యిందని అన్నారు. తాను ఏనాడూ చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ లేద‌న్నారు. ఇంతకీ ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశాడ‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారంది. కాగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేశాడా లేక కొండా సురేఖ‌, కొండా ముర‌ళిని ఉద్దేశించి చేశాడా అన్న‌ది హాట్ టాపిక్ గా మారింది. ఇటీవ‌ల ఉమ్మ‌డి ఓరుగ‌ల్లు జిల్లాలో చోటు చేసుకుంది దెక్క‌న్ సిమెంట్స్ వ్య‌వ‌హారం.

ఈ ఘ‌ట‌న‌లో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితా ప‌టేల్. ఆమె ఏకంగా ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని, ఆయ‌న సోద‌రులు కొండ‌ల్ రెడ్డి, తిరుప‌తి రెడ్డిల గురించి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. వారికి ఎలాంటి ప‌ద‌వులు లేకుండానే ఎలా గ‌న్ మెన్ల‌ను ఇచ్చారంటూ నిల‌దీశారు. ఒక కేబినెట్ మంత్రిగా ఉన్న త‌న త‌ల్లి ఇంటికి పోలీసులు, మ‌ఫ్టీలో ఉన్న వారు ఎలా వ‌స్తారంటూ ప్ర‌శ్నించారు. ఈ వ్య‌వ‌హారం చిలికి చిలికి గాలివాన‌గా మారింది. ఈ త‌రుణంలో ఓరుగ‌ల్లు జిల్లాకు చెందిన నేత‌లు ఇలా మూకుమ్మ‌డిగా ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం కాంగ్రెస్ పార్టీలో చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది.

  • Related Posts

    రేపే విశాఖ‌కు రాష్ట్ర‌ప‌తి ముర్ము రాక

    Spread the love

    Spread the loveభ‌ద్ర‌తా ఏర్పాట్లు ప‌రిశీలించిన మంత్రి అమ‌రావ‌తి : భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము మంగ‌ళ‌వారం విశాఖ‌ప‌ట్నం జిల్లాకు రానున్నారు. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర‌ప‌తి రాక సంద‌ర్బంగా ఏర్పాట్ల‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు రాష్ట్ర హోం…

    రైతులు శాస్త్ర‌వేత్త‌ల సూచ‌న‌లతో సాగు చేయాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : రైతులు సంప్రదాయ సాగు విధానాలతో పాటు మార్కెట్ అవసరాలు, శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా పంటల సాగు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఒక సంవత్సరం ధరలు బాగున్నాయని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *