ఇప్పటి వరకు 110 మంది చని పోయారు
హైదరాబాద్ : రాష్ట్రంలోని గురుకులాలలో పిల్లలు చని పోతున్నా సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, సీనియర్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. శనివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. శ్రీవర్షిత అనే అమ్మాయి సూసైడ్ చేసుకుని చని పోయందని, దీనికి కారణంగా స్కూల్ ప్రిన్సిపాల్, వార్డెన్ అని ఆరోపించారు. ఆ ఇద్దరినీ వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. శ్రీవర్షిత హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన అమ్మాయి అని తెలిపారు. ఒక్కో విద్యార్థిపైన కేసీఆర్ లక్షా 25 వేలు ఖర్చు పెట్టి గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు. శ్రీవర్షిత స్కూల్‌లో టాపర్ అని వెల్లడించారు. స్కూల్‌లో ఉన్న గ్రాసరీస్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ తీసుకు వెళుతుంటే తను చూసిందన్నారు. దీంతో తీవ్రంగా మానసికంగా వేధింపులకు గురి చేశారని ఆరోపించారు.
6:30 గంటలకు ఫోన్‌లో తల్లిదండ్రులతో మాట్లాడి 7:30 గంటలకు సూసైడ్ చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎస్పీ, కౌశిక్ రెడ్డి. శ్రీవర్షిత డెడ్ బాడీని ట్రాక్టర్‌లో తీసుకు వెళ్లారని తెలిపారు. ఇప్పటి వరకు గురుకులాల్లో 110 మంది విద్యార్థులు చని పోయారని వాపోయారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్, కేటిఆర్, హరీష్ రావుపై కోపం ఉంటే వాళ్లపై పగ తీర్చు కోవాలన్నారు. శ్రీవర్షితను టార్చర్ చేసిన స్కూల్ ప్రిన్సిపాల్, వార్డెన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. శ్రీవర్షిత కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.






