అకాల వ‌ర్షం ల‌క్ష‌న్న‌ర ఎక‌రాల్లో పంట న‌ష్టం

Spread the love

ఏపీ స‌ర్కార్ ఆదుకోవ‌డంలో వైఫ‌ల్యం

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ స‌ర్కార్ రైతుల ప‌ట్ల‌, వ్య‌వ‌సాయ రంగం ప‌ట్ల క‌క్ష‌సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. అకాల వ‌ర్షాల కార‌ణంగా రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లో అత్య‌ధికంగా సాగు చేసిన పంట‌లు చేతికి రాకుండా పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శ‌నివారం ష‌ర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఐటీ మీద ఉన్నంత సోయి రైతుల ప‌ట్ల లేకుండా పోయింద‌న్నారు. దాదాపు 158 మండలాల్లో లక్షన్నర ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. రాను రాను పంట న‌ష్టం ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు ష‌ర్మిలా రెడ్డి.

అత్యధికంగా కర్నూల్ జిల్లాలో 25 వేల ఎకరాలు, నంద్యాల జిల్లాలో 12 వేలు, ప్రకాశం జిల్లాలో 14 వేలు, శ్రీకాకుళం జిల్లాలో 8 వేలు, కోనసీమ జిల్లాలో 7 వేల ఎకరాల్లో పంట‌లు పూర్తిగా చేతికి రాకుండా పోయాయ‌ని, రైతులు రోడ్ల పాల‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయంటూ ఆవేద‌న చెందారు ఏపీపీసీసీ చీఫ్‌. తాము చెప్ప‌డం లేద‌ని, ఏపీకి చెందిన అధికారులే ఈ వివ‌రాలు వెల్ల‌డించార‌ని అన్నారు. అయినా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక పోవ‌డం రైతుల ప‌ట్ల ఏపీ కూట‌మి స‌ర్కార్ కు ఉన్న ప్రేమ ఏమిటో తెలుస్తుంద‌న్నారు . పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయలతో పాటు ఇతర పంటలు పనికి రాకుండా పోయాయని వాపోయారు. రైతుల‌కు సంబంధించి న‌ష్ట పోయిన పంట‌ల వివ‌రాలు సేక‌రించాల‌ని, ఏ ఒక్క రైతుకు న‌ష్ట పోకుండా త‌క్ష‌ణ‌మే న‌ష్ట ప‌రిహారం అందించాల‌ని ష‌ర్మిలా రెడ్డి స‌ర్కార్ ను డిమాండ్ చేశారు.

  • Related Posts

    రేపే విశాఖ‌కు రాష్ట్ర‌ప‌తి ముర్ము రాక

    Spread the love

    Spread the loveభ‌ద్ర‌తా ఏర్పాట్లు ప‌రిశీలించిన మంత్రి అమ‌రావ‌తి : భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము మంగ‌ళ‌వారం విశాఖ‌ప‌ట్నం జిల్లాకు రానున్నారు. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర‌ప‌తి రాక సంద‌ర్బంగా ఏర్పాట్ల‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు రాష్ట్ర హోం…

    రైతులు శాస్త్ర‌వేత్త‌ల సూచ‌న‌లతో సాగు చేయాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : రైతులు సంప్రదాయ సాగు విధానాలతో పాటు మార్కెట్ అవసరాలు, శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా పంటల సాగు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఒక సంవత్సరం ధరలు బాగున్నాయని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *