తీరం దాటిన మొంథా తీవ్ర తుఫాన్

నేల కొరిగిన చెట్లు, పొంగుతున్న వాగులు

అమ‌రావ‌తి : మొంథా తుపాను ఏపీని అత‌లాకుత‌లం చేసింది. భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎక్క‌డ చూసినా నీళ్లే. వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. నరసాపూర్ సమీపంలో తీరం దాటింది మొంథా తుపాను. అర్ధ‌రాత్రి 11:30-12:30 మధ్య తీరం దాటింది. ఇవాళ ఉద‌యం తీవ్ర రూపం దాల్చింది.
అల్లకల్లోలంగా మారింది సముద్రం. తీరంలో ఎగసి పడుతున్నాయి అలలు. తుఫాన్ ప్రభావంతో భారీగా వీస్తున్నాయి ఈదురు గాలులు. ‘మొంథా’ ప్రభావంపై 12 గంటల పాటు ఏకధాటిగా సీఎం చంద్రబాబు సమీక్ష చేప‌ట్టారు. రాత్రి ఒంటి గంట దాటిన తర్వాత కూడా సచివాలయంలోనే ఉండి పరిస్థితులను సమీక్షించారు. ఇదిలా ఉండ‌గా కాకినాడ సమీపంలో మత్సకారుడు గల్లంత‌య్యాడు. కుంభాభిషేకం రేవు వద్ద సముద్రంలో వ్యక్తి క‌నిపించ‌కుండా పోయాడు. బోటును ఒడ్డుకు చేర్చే క్రమంలో సముద్రంలో జారిపడ్డాడు మత్సకారుడు సాయిరామ్‌.

మ‌రో వైపు మొంథా తుపాను ఎఫెక్ట్ ఎక్కువ‌గా ఉంది. ముందు జాగ్ర‌త్త‌గా ద‌క్షిణ మ‌ధ్య రైల్వే శాఖ ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. చాలా రైళ్ల‌ను నిలిపి వేసింది. దీంతో వివిధ ప్రాంతాల‌కు వెళ్లే ప్ర‌యాణీకులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా విశాఖ-కిరండూల్‌ రైల్వే లైన్‌లో ధ్వంసమైంది ట్రాక్‌. ఏపీలో పలు చోట్ల విధ్వంసం సృష్టించింది ముంథా తుపాను .విశాఖ-కిరండూల్‌ సింగిల్‌ రైల్వే లైన్‌, అరకు రైల్వే టన్నెల్‌ నెంబర్‌ 32ఏ వద్ద రైల్వే ట్రాక్‌ ధ్వంసమైంది. చిమిడిపల్లి, బొర్రా గుహలు రైల్వే స్టేషన్ల మధ్యలోనూ రైల్వే ట్రాక్‌ పూర్తిగా ప‌నికి రాకుండా పోయింది. ఈదురు గాలుల కారణంగా నేలకొరిగాయి చెట్లు.. తీరప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఇళ్లను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు .

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *