త‌మిళ‌నాడులో ప్లాంట్ ను కైవ‌సం చేసుకున్న ఎంఈఐఎల్

Spread the love

మెగా ప‌వ‌ర్ ప్రాజెక్టు చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌న‌త అన్న ఎండీ

హైద‌రాబాద్ : మేఘా ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. సంస్థ త‌మిళ‌నాడు రాష్ట్రంలోని 250 మెగా వాట్ల విద్యుత్ ప్లాంటును చేజిక్కించుకుంది. టి ఏ క్యూ ఏ నేవెలీని తన ప్రస్తుత విద్యుత్ ఉత్పత్తి ఆపరేషన్లలో సులభంగా సమన్వయం చేయడాన్ని ఎం ఈ ఐ ఎల్ ఎనర్జీ ప్రాధాన్యంగా తీసుకుంటోంది. దీని ద్వారా ఆపరేషనల్ ఎక్సలెన్స్, సమర్థవంతమైన ఆస్తి నిర్వహణ తదితరాలకు సంస్థ కట్టుబడింది. ఈ సందర్భంగా ఎం ఈ ఐ ఎల్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సలిల్ కుమార్ మిశ్రా మాట్లాడారు. ఉన్నత నాణ్యత గల విద్యుత్ ఉత్పత్తి ఆస్తులను స్వాధీనం చేసుకోవడంలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తోందని అన్నారు. ఈపీసీ రంగంలో త‌మ అత్యుత్తమ నైపుణ్యాన్ని మౌలిక సదుపాయాల యాజమాన్యంతో కలిపి వ్యూహాత్మక మార్పు సాధించడానికి ఈ కొనుగోలు తోడ్పడుతుందని చెప్పారు.

త‌మ ప్రధాన దృష్టి, దేశీయ ఇంధన భద్రతను పెంపొందించే, నమ్మదగిన విద్యుత్ సరఫరా అందించే, భారతదేశ దీర్ఘకాలిక అభివృద్ధికి మద్దతు ఇచ్చే వ్యూహాత్మక పెట్టుబడులపై కొనసాగుతుందని స్ప‌ష్టం చేశారు మిశ్రా. థర్మల్, హైడ్రో, పునరుత్పాదక శక్తి రంగాలను సమన్వయం చేసే సమతులిత, స్థిరమైన విద్యుత్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఆర్గానిక్ , ఇనార్గానిక్ వృద్ధి వ్యూహాలకు అనుగుణంగా ఉందని తెలిపారు. భారత విద్యుత్ రంగంపై త‌మ‌కు ఉన్న విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తోంది అని చెప్పారు. ఎం ఈ ఐ ఎల్ ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి, చమురు, సహజ వాయువు, పునరుత్పాదక శక్తి, మౌళిక సదుపాయాలు, తయారీ , నీటి నిర్వహణ తదితర రంగాల్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. భవిష్యత్తులో భారత ఇంధన స్వావలంబన, ఆర్థిక స్థిరత్వంకు తోడ్పడే అవకాశాలను పరిశీలించి ముందుకు సాగుతోంది.

  • Related Posts

    ఏబీఎన్ రాధాకృష్ణా జ‌ర జాగ్ర‌త్త : భ‌ట్టి విక్ర‌మార్క

    Spread the love

    Spread the loveప‌రోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపైనా కూడా కామెంట్స్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై అడుగ‌డుగునా విద్వేషం చిమ్ముతూ లేకి వార్త‌లు రాస్తూ వ‌స్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ నిర్వాకంపై సీరియ‌స్ అయ్యారు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌. తాను సింగ‌రేణి…

    కేసీఆర్, బీఆర్ఎస్ ను బొంద పెట్టాలి : రేవంత్ రెడ్డి

    Spread the love

    Spread the loveపాలేరు స‌భ‌లో ముఖ్య‌మంత్రి షాకింగ్ కామెంట్స్ ఖ‌మ్మం జిల్లా : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మ‌రోసారి నోరు పారేసుకున్నారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా మాజీ సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను, క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *