ప‌డి లేచిన కెర‌టం జెమీమా రోడ్రిగ్స్

ఎందుకు త‌ల్లీ నువ్వు ఏడ్వ‌డం. ఎవ‌రు త‌ల్లీ నువ్వు బ‌ల‌హీనురాలివ‌ని గేలి చేసింది. ఎవ‌రు త‌ల్లీ నిన్ను ఇబ్బందులకు గురి చేసింది. అన్నింటినీ త‌ట్టుకుని, నిటారుగా నిల‌బ‌డి, కొండ‌త ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు నువ్వు పోరాడిన తీరు అద్భుతం. అస‌మాన్యం. నిన్ను చూసి ఈ దేశం గ‌ర్విస్తోంది. కోట్లాది మ‌హిళ‌లే కాదు పురుషులు కూడా నీతో పాటే క‌న్నీళ్లు కారుస్తున్నారు. నువ్వు ఆడింది 134 బంతులే కావ‌చ్చు. కానీ అది ప్ర‌త్య‌ర్థుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లేలా చేసింది. 143 కోట్ల భార‌తీయుల‌ను స‌గ‌ర్వంగా త‌ల ఎత్తుకునేలా చేసింది. లక్ష్యం అంద‌నంత దూరంలో ఉన్నా , జెమీమా నువ్వు ఆడిన తీరు, ప్ర‌ద‌ర్శించిన తెగువ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎక్క‌డైనా స‌రే బ‌త‌కాలంటే యుద్దం చేయ‌క త‌ప్ప‌దు తల్లీ. ఇక్క‌డ జ‌న్మించ‌డం న‌రకం..మ‌ర‌ణించ‌డం యుద్ద‌మే. ఈ మ‌ధ్య కాలంలో మ‌నం త‌ల ఎత్తుకుని నిల‌బ‌డాలంటే, ఆ ప‌ద‌కొండు మందిలో నువ్వు ఉండాలంటే ఎంతో పోరాటం చేయాల్సి ఉంటుంది త‌ల్లీ.

అవ‌మానాల‌ను త‌ట్టుకుని, క‌న్నీళ్ల‌ను దిగ‌మింగుకుని , జ‌ట్టు నుంచి నిష్క్ర‌మించి , అనుకోకుండా తిరిగి ఎంపికై నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్న తీరు నేటి యువ‌తుల‌కు పాఠం కావాలి. ఆట ఎప్పుడూ సజావుగా సాగదు. ఒకవేళ అలా సాగితే అది ఆట అనిపించుకోదు. తాడో పేడో తేల్చు కోవాలి. మ‌న‌ల్ని మ‌నం అర్పించు కోవాలి. మైదానంలో మ‌నం ఒక్క‌ర‌మే ..కానీ మ‌న చుట్టూ ల‌క్ష‌లాది క‌ళ్లు నిశితంగా గ‌మ‌నిస్తుంటాయి. వెక్కిరిస్తుంటాయి. గేలి చేస్తుంటాయి. అవ‌మాన ప‌రుస్తుంటాయి. కొన్నినోళ్లు పారేసుకుంటాయి. మ‌న‌ల్ని వెనక్కి నెట్టి వేసేందుకు. కానీ నువ్వు ఒక్క‌దానివే చివ‌రి దాకా , గెలుపు తీరాలకు చేర్చేంత దాకా సాగించిన ప్ర‌య‌త్నం ఎప్ప‌టికీ, ఎల్లప్ప‌టికీ నిలిచి పోతుంది త‌ల్లీ. నువ్వు క‌న్నీళ్లు కార్చ‌డానికి ముమ్మాటికీ అర్హురాలివే. ఎందుకంటే దాని వెనుక ప్ర‌శ్నించ లేని, నిల‌దీయ లేని దుఖఃం దాగి ఉంది. అంత‌కు మించిన విషాదం ఉంది. దానిని కొలిచేందుకు ఏ సాధ‌న‌మూ లేదు. ఇంకా క‌నిపెట్ట‌లేదు. నువ్వు ఏమిటో నీకు తెలిసినంత‌గా ఇంకెవ్వ‌రికీ తెలియ‌దు.

చిన్న‌ప్ప‌టి నుంచి క్రికెట్ అంటే ప్రాణం పెట్టిన నువ్వు . దేశం త‌ర‌పున ఆడేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డ్డావు. ఫామ్ లేని కార‌ణంతో జ‌ట్టు నుంచి తొల‌గించినా, ఒక్క‌దానివే ఏడ్చావు త‌ప్పా ఎదిరించేందుకు ,ఇంకొక‌రిపై నింద‌లు మోపేందుకు నువ్వు ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఇదే నిజ‌మైన స్పోర్ట్స్ ఉమెన్ షిప్ అంటే. ఈ దేశం ఒకే కోణంలో చూస్తుంది. నువ్వు ఆడితే చ‌ప్ప‌ట్లు కొడుతుంది. నువ్వు నిష్క్ర‌మిస్తే అభాండాలు వేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తుంది. ఇది స‌హ‌జం. ప్ర‌పంచం అంతా కొన‌సాగుతున్న నిజం. కొంద‌రే స‌క్సెస్ అవుతారు. ఇంకొంద‌రు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన సంత‌కాన్ని చేసేస్తారు. అది అంద‌రికీ సాధ్యం కాదు త‌ల్లీ. కొంద‌రికే ఆ అవ‌కాశం ద‌క్కుతుంది. కులం పేరుతో, మ‌తం పేరుతో, అధికారం, హోదా పేరుతో మ‌నుషుల్ని బేరీజు వేస్తున్న ఈ స‌మ‌యంలో జెమీమా నువ్వు పోరాడిన తీరు ఎల్ల‌కాలం గుర్తుండి పోతుంది. క‌ళ్లను కాపాడే క‌నుపాపల్లాగా.

”ఆ ముఖం వెనుక అంతులేని ఆందోళ‌న‌. నిద్ర‌లేని రాత్రులు, అంచ‌నాల బ‌రువుతో, అంత‌కు మించిన ఆశ‌ల‌తో పోరాడుతున్న స‌గ‌టు అమ్మాయి ఉంది. నిశ్శ‌బ్దంగా ఏడుస్తోంది. పేల‌వ‌మైన ప్రారంభం నుంచి అనుకోకుండా తొల‌గించే దాకా. కానీ త‌న‌ను తాను న‌మ్ముకుంది. ఛాంపియ‌న్లు ఎప్పుడూ ప‌డిపోతూనే ఉంటారు. కానీ ప‌డినా లేస్తారు. కెర‌టంలా దూసుకు వ‌స్తారు. ఈ దేశానికి అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో నువ్వు అత్య‌వ‌స‌రంగా మారావు. స‌మున్న‌త భార‌తావ‌ని త‌ల ఎత్తుకునేలా, గ‌ర్వంగా పేరు చెప్పుకునేలా చేశావు. త‌ల్లీ నీ పోరాటానికి ఎల్ల‌ప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాం.”

  • Related Posts

    ఎక్స్‌ప్రెస్ ఇంగ్లీష్ 21 రోజుల్లో ప‌క్కా స‌క్సెస్

    ఇంగ్లీష్ ట్రైన‌ర్ వి. రాఘ‌వేంద్ర అదుర్స్ టెక్నాల‌జీ పెరిగినా పుస్త‌కాలు చ‌ద‌వ‌డం మాన‌డం లేదు. ఇందుకు ఉదాహ‌ర‌ణ ప్ర‌ముఖ ఇంగ్లీష్ ట్రైన‌ర్ వి. రాఘ‌వేంద్ర రాసిన ఎక్స్‌ప్రెస్ ఇంగ్లీష్ 21 రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ పుస్త‌కం హాట్ కేకుల్లా అమ్ముడు పోతోంది.…

    భూమి పుత్రుడా..గాయ‌కుడా అల్విదా..!

    అస్సాం న‌గ‌రం జ‌న సంద్రంగా మారింది దుఖఃంతో. త‌మ భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రినీ కంట‌త‌డి పెట్టించేలా చేసింది. అశేష జ‌న‌వాహిని త‌న‌కు అశ్రునివాళులు అర్పించేందుకు బారులు తీరారు. అస్సాం అంటేనే భూపేన్ హ‌జారికా గుర్తుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *