శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు

శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం

తిరుప‌తి : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు కొన‌సాగుతాయ‌ని తెలిపింది. ఈనెల 8, 15, 22, 29 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. నవంబర్ 05వ తేదీన పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర కలశాభిషేకం, సాయంత్రం 5.30 గంటలకు స్వామివారు పుష్కరిణికి వేంచేపు చేస్తారు.
10న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, సాయంత్రం 5.30 గం.లకు స్వామివారు పుష్కరిణికి వేంచేపు చేస్తారు.

20న ఉదయం 09.00 గం.లకు అమావాస్య, స‌హ‌స్ర‌ కలశాభిషేకం, రాత్రి 7.00 గం.లకు హనుమంత వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు. నవంబర్ నెలలో తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఆదివారం కైశిక ద్వాదశి ఆస్థానం చేప‌ట్టారు. 05న పౌర్ణమి గరుడసేవ
నవంబర్ 14, 21, 28 తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. 07న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధి స్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. 15న ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజస్వామి వారు మాడ వీధులలో విహరిస్తారు.

నవంబర్ 26న శ్రావణం నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు మాడ వీధులలో భక్తులను కటాక్షిస్తారు. ర్ 25 నుండి డిసెంబర్ 04 వరకు శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఉత్సవం ఉంటుంద‌ని టీటీడీ వెల్ల‌డించింది.

  • Related Posts

    స‌త్య‌సాయి బాబా స్పూర్తి తోనే జ‌ల్ జీవ‌న్ మిష‌న్

    ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్…

    స‌త్య‌సాయి బాబా జీవితం ఆద‌ర్శ‌ప్రాయం

    స్ప‌ష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ అమ‌రావ‌తి : ఈ భూమి మీద పుట్టిన అద్భుత‌మైన వ్య‌క్తి భ‌గ‌వాన్ శ్రీ స‌త్య సాయి బాబా అన్నారు మంత్రి కందుల దుర్గేష్. సేవకు పర్యాయపదం, ప్రతిరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *