శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి స‌న్నిధిలో లోకేష్

Spread the love

అయ్య‌ప్ప భ‌క్తుల పూజ‌లో పాల్గొన్న మంత్రి

అమరావతి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మంగ‌ళ‌గిరి లోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్బంగా అయ్య‌ప్ప భ‌క్తులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. పెద్ద ఎత్తున అయ్య‌ప్ప స్వామి మాల‌లు ధ‌రించారు. వారంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ మధు నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, భవానీలతో పాటు పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. అనంత‌రం అయ్య‌ప్ప స్వామి మాలాధార‌ణ చేప‌ట్టిన భ‌క్తుల‌కు పెద్ద ఎత్తున మ‌హా ప్ర‌సాదం పంపిణీ చేశారు. స్వ‌యంగా పాల్గొన్నారు మంత్రి. వారికి పండ్లు, ఫ‌ల‌హారాలు, ఇత‌ర ప్ర‌సాదాల‌ను అందించారు. అయ్య‌ప్ప స్వామి క‌రుణ క‌టాక్షం అయ్య‌ప్ప స్వాముల‌కు క‌ల‌గాల‌ని ఆ దేవుడిని ప్రార్థించిన‌ట్లు తెలిపారు లోకేష్. త‌మ ప్ర‌భుత్వం ఆల‌యాల అభివృద్దికి కృషి చేస్తోంద‌ని చెప్పారు.

  • Related Posts

    శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకార్ల సాత్తుమొర

    Spread the love

    Spread the loveఅంగ‌రంగ వైభ‌వోపేతంగా స్వామి వారి అభిషేకం తిరుమ‌ల : తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర ఘనంగా నిర్వ‌హించారు. శ్రీరామానుజుల వారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భాష్యకార్ల సాత్తుమొర నిర్వహించ‌డం ఆన‌వాయితీగా…

    శ్రీ రామానుజాచార్యుల గ్రంథ సంపద గొప్ప‌ది

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన‌ డా. చక్రవర్తి రంగనాథన్ తిరుపతి : శ్రీ రామానుజాచార్యుల గ్రంథాలు ఆధ్యాత్మికత, తాత్వికతతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయని డా. చక్రవర్తి రంగనాథన్ కొనియాడారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క‌మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో తిరుపతిలోని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *