క‌రూర్ ఘ‌ట‌న‌పై టీవీకే కార్యాల‌యంలో సీబీఐ ఆరా

సీసీటీవీ ఫుటేజ్ లు, కీల‌క‌మైన ప‌త్రాలు సేక‌ర‌ణ

చెన్నై : దేశ వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించిన క‌రూర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న . టీవీకే పార్టీ చీఫ్ , ప్ర‌ముఖ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ చేప‌ట్టిన ర్యాలీలో ఊపిరి ఆడ‌క ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విచార‌ణ‌కు ఆదేశించింది త‌మిళ‌నాడు డీఎంకే ప్ర‌భుత్వం. ఇదే స‌మ‌యంలో మ‌ద్రాస్ హైకోర్టు సీరియ‌స్ అయ్యింది ఈ అంశంపై దాఖ‌లు అయిన కేసు విచార‌ణ సంద‌ర్బంగా. ఈ మేర‌కు స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీంను ఏర్పాటు చేయాల‌ని, నిబ‌ద్ద‌త క‌లిగిన పోలీస్ ఆఫీస‌ర్ ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది. ఇదే స‌మ‌యంలో సీఎం ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రిటైర్డ్ జ‌డ్జిని విచార‌ణ నిమ‌త్తం నియ‌మించిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంతో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజ‌య్ చేప‌ట్టిన ర్యాలీ, ప్ర‌చారం ఉన్న‌ట్టుండి ఆగి పోయింది. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది కోర్టు. పూర్తిగా బాధ్య‌తా రాహిత్యంతో వ్య‌వ‌హ‌రించారంటూ వ్యాఖ్యానించింది.

ఇదే క్ర‌మంలో డీఎంకేతో పాటు బీజేపీ, అన్నాడీఎంకే నేత‌లు బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల‌కు రూ. 25 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు టీవీకే విజ‌య్. ఇదే స‌మ‌యంలో త‌మ త‌ప్పేమీ లేద‌ని, కావాల‌ని దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందంటూ టీవీకే సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం కేంద్ర ద‌ర్యాప్తు సంస్త సీబీఐని విచారించాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు సోమ‌వారం చెన్నై లోని టీవీకే ప్ర‌ధాన కార్యాల‌యానికి
విచార‌ణ బృందం చేరుకుంది. ఈ సంద‌ర్బంగా క‌రూర్ ఘ‌ట‌న‌కు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ లతో పాటు కీల‌క‌మైన ప‌త్రాల‌ను ప‌రిశీలించింది. కొన్నింటిని త‌మ‌కు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.

  • Related Posts

    మత్స్యకారులు, ఆక్వా రైతుల అభ్యున్న‌తికి కృషి

    రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగ పుత్రులందరికీ రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే కూట‌మి ప్రభుత్వ ధ్యేయమని,…

    ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న : సీఎం

    వ్య‌వ‌సాయ రంగానికి అధిక ప్రాధాన్య‌త అమ‌రావ‌తి : ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపారు. అన్న‌దాత సుఖీభ‌వ కింద రెండు విడతల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *