దేవుళ్ల మీద ఒట్టేశారు జ‌నానికి టోపీ పెట్టారు

Spread the love

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : కాంగ్రెస్ స‌ర్కార్ అన్ని రంగాల‌లో వైఫ‌ల్యం అందింద‌ని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. త‌న స‌మ‌క్షంలో బీజేపీకి చెందిన ప‌లువురు చేరారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ప్ర‌సంగించారు. కాంగ్రెస్ నేత‌లు, సీఎం ఇష్టానుసారం హామీలు ఇచ్చార‌ని, చెవుళ్లో పూలు పెట్టారంటూ ఎద్దేవా చేశారు. చివ‌ర‌కు దేవుళ్ల‌ను సైతం విడిచి పెట్ట‌లేద‌ని, వారిపై కూడా ఒట్టేశార‌ని, జ‌నానికి టోపీ పెట్టారంటూ మండిప‌డ్డారు కేటీఆర్. ఈ రెండేళ్ల ప్ర‌భుత్వంలో ఎవరికైనా, ఏ రంగానికైనా మేలు చేకూరిందా అని ప్ర‌శ్నించారు. మ‌హిళ‌ల‌కు రూ. 4000, యువ‌తులకు రూ. 2500, తులం బంగారం అంటూ నోటికొచ్చిన హామీలు ఇచ్చారంటూ ఫైర్ అయ్యారు. అడ్డ‌గోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిందన్నారు.

ఇచ్చిన హామీల‌పై కాంగ్రెస్ నేత‌లు, సీఎం రేవంత్ రెడ్డిని నిల‌దీస్తే న‌న్నెవ‌రు న‌మ్మ‌ట్లేదు అంటున్నారని పేర్కొన్నారు కేటీఆర్. ఢిల్లీకి పోతే దొంగలా చూస్తున్నార‌ని అంటున్నారని, మ‌రి దొంగ‌ను దొంగలాగానే క‌దా చూస్తారని అన్నారు. ఇంటికి పెద్ద‌లాంటి నాయ‌కుడే ఇలా మాట్లాడితే ఇంకెవ‌రు న‌మ్ము తారంటూ ప్ర‌శ్నించారు. అప్పు తీసుకుంటే కూడా నిబద్ధ‌త‌తో ప‌ని చేయాలన్నారు. వంద రోజుల్లో ఇస్తాన‌న్న హామీలు ఏడు వంద‌ల రోజులైనా కాంగ్రెస్ నెర‌వేర్చ‌ట్లేదని మండిప‌డ్డారు. వృద్ధులు, నిరుద్యోగులు, మ‌హిళ‌లు, యువ‌తులు అంద‌రూ హామీల గురించి అడుగుతున్నారని పేర్కొన్నారు. చేత‌కాక‌పోతే అధికారంలోకి రావ‌డానికి అడ్డ‌మైన హామీలు ఇచ్చినా.. నాతో కావ‌ట్లేద‌ని రేవంత్ రెడ్డి ప‌క్క‌కు కూర్చోవాల‌ని హిత‌వు ప‌లికారు.

  • Related Posts

    అన్నాడీఎంకే సంచ‌ల‌నం ఓట‌ర్ల‌కు గాలం

    Spread the love

    Spread the loveమ‌హిళ‌ల‌కు నెల‌కు 2 వేలు..పురుషుల‌కు ఫ్రీ బ‌స్ చెన్నై : త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల కోలాహ‌లం మొద‌లైంది. అధికారంలో ఉన్న డీఎంకేతో పాటు అన్నాడీఎంకే తో కూడిన ఎన్డీయే, సూప‌ర్ స్టార్ హీరో త‌ళ‌ప‌తి విజ‌య్ టీవీకేతో పాటు ప‌లు…

    రైతుల సంక్షేమం స‌ర్కార్ ల‌క్ష్యం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా : త‌మ ప్ర‌భుత్వం రైతు సంక్షేమం కోసం ప‌ని చేస్తుంద‌ని చెప్పారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలన అంటే రైతు సంక్షేమం, రైతు క్షేత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *