దేవుళ్ల మీద ఒట్టేశారు జ‌నానికి టోపీ పెట్టారు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : కాంగ్రెస్ స‌ర్కార్ అన్ని రంగాల‌లో వైఫ‌ల్యం అందింద‌ని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. త‌న స‌మ‌క్షంలో బీజేపీకి చెందిన ప‌లువురు చేరారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ప్ర‌సంగించారు. కాంగ్రెస్ నేత‌లు, సీఎం ఇష్టానుసారం హామీలు ఇచ్చార‌ని, చెవుళ్లో పూలు పెట్టారంటూ ఎద్దేవా చేశారు. చివ‌ర‌కు దేవుళ్ల‌ను సైతం విడిచి పెట్ట‌లేద‌ని, వారిపై కూడా ఒట్టేశార‌ని, జ‌నానికి టోపీ పెట్టారంటూ మండిప‌డ్డారు కేటీఆర్. ఈ రెండేళ్ల ప్ర‌భుత్వంలో ఎవరికైనా, ఏ రంగానికైనా మేలు చేకూరిందా అని ప్ర‌శ్నించారు. మ‌హిళ‌ల‌కు రూ. 4000, యువ‌తులకు రూ. 2500, తులం బంగారం అంటూ నోటికొచ్చిన హామీలు ఇచ్చారంటూ ఫైర్ అయ్యారు. అడ్డ‌గోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిందన్నారు.

ఇచ్చిన హామీల‌పై కాంగ్రెస్ నేత‌లు, సీఎం రేవంత్ రెడ్డిని నిల‌దీస్తే న‌న్నెవ‌రు న‌మ్మ‌ట్లేదు అంటున్నారని పేర్కొన్నారు కేటీఆర్. ఢిల్లీకి పోతే దొంగలా చూస్తున్నార‌ని అంటున్నారని, మ‌రి దొంగ‌ను దొంగలాగానే క‌దా చూస్తారని అన్నారు. ఇంటికి పెద్ద‌లాంటి నాయ‌కుడే ఇలా మాట్లాడితే ఇంకెవ‌రు న‌మ్ము తారంటూ ప్ర‌శ్నించారు. అప్పు తీసుకుంటే కూడా నిబద్ధ‌త‌తో ప‌ని చేయాలన్నారు. వంద రోజుల్లో ఇస్తాన‌న్న హామీలు ఏడు వంద‌ల రోజులైనా కాంగ్రెస్ నెర‌వేర్చ‌ట్లేదని మండిప‌డ్డారు. వృద్ధులు, నిరుద్యోగులు, మ‌హిళ‌లు, యువ‌తులు అంద‌రూ హామీల గురించి అడుగుతున్నారని పేర్కొన్నారు. చేత‌కాక‌పోతే అధికారంలోకి రావ‌డానికి అడ్డ‌మైన హామీలు ఇచ్చినా.. నాతో కావ‌ట్లేద‌ని రేవంత్ రెడ్డి ప‌క్క‌కు కూర్చోవాల‌ని హిత‌వు ప‌లికారు.

  • Related Posts

    మత్స్యకారులు, ఆక్వా రైతుల అభ్యున్న‌తికి కృషి

    రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగ పుత్రులందరికీ రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే కూట‌మి ప్రభుత్వ ధ్యేయమని,…

    ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న : సీఎం

    వ్య‌వ‌సాయ రంగానికి అధిక ప్రాధాన్య‌త అమ‌రావ‌తి : ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపారు. అన్న‌దాత సుఖీభ‌వ కింద రెండు విడతల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *