బ‌స్సు ప్ర‌మాద కుటుంబాల‌కు ఎక్స్ గ్రేషియా

Spread the love

రూ. 5 ల‌క్ష‌లు, గాయ‌ప‌డిన వారికి రూ. 2 ల‌క్ష‌లు
రంగారెడ్డి జిల్లా : చేవెళ్ళ మండలం ఖానాపూర్ గేటు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని చేవెళ్ల‌, హైద‌రాబాద్ లోని ప‌లు ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. మెరుగైన వైద్యం అందించాల‌ని ఇప్ప‌టికే ఆదేశించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండ‌గా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. కంక‌ర లోడ్ తో వెళుతున్న లారీ అత్యంత వేగంగా రావ‌డం, బ్యాలెన్స్ త‌ప్పి బ‌స్సును ఢీకొట్ట‌డంతో అక్క‌డిక‌క్క‌డే ప‌లువురు ప్ర‌యాణీకులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో డ్రైవ‌ర్ కూడా ఉన్నారు. మ‌రో వైపు బ‌స్సుల సంఖ్య పెంచ‌క పోవ‌డం కూడా ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని అంటున్నారు.

ఆర్టీసీ బ‌స్సు తాండూరు నుంచి హైద‌రాబాద్ కు బ‌య‌లు దేరింది. అంద‌రూ ఆదివారం సెల‌వు కావ‌డంతో తాండూరుకు వెళ్లారు. తిరిగి ప్ర‌యాణం అయ్యారు. అంత‌లోనే కాన‌రాని లోకాల‌కు వెళ్లారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెళ్లు కూడా ఉన్నారు. ప‌రిస్థితి హృద‌య విదార‌కంగా ఉంది. గ్రామ‌స్థులు స‌మాచారం ఇవ్వ‌డంతో రాచ‌కొండ పోలీసులు అక్క‌డికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. బ‌స్సులో ఇరుక్కు పోయిన వారిని బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చారు. ఇదిలా ఉండ‌గా ఇవాళ స‌మాచారం తెలిసిన వెంట‌నే హుటా హుటినా ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లారు మంత్రులు పొన్నం ప్రభాక‌ర్ గౌడ్, దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు, విప్ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, రామ్మోహన్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా విచార‌ణ‌కు ఆదేశించామ‌ని చెప్పారు. మృతి చెందిన కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికి రూ. 5 ల‌క్ష‌లు, గాయ‌ప‌డిన వారికి రూ. 2 ల‌క్ష‌లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.

  • Related Posts

    గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం

    Spread the love

    Spread the loveఅంద‌జేస్తామ‌న్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని గ్రామాల స‌ర్వతోముఖాభివృద్దికి సంపూర్ణ స‌హ‌కారం అంద‌జేస్తామ‌ని అన్నారు. ఈ సంద‌ర్బంగా అన్ని ర‌కాలుగా స‌హాయ స‌హ‌కారాలు…

    డిజిటల్ సెన్సస్ 2027 కోసం సన్నాహాలు

    Spread the love

    Spread the loveతెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీక్ష‌ హైద‌రాబాద్ : ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తో పాటు సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ తెలంగాణ భారతి హోళికేరితో కలిసి రాబోయే సెన్సస్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాల గురించి జిల్లా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *