నిప్పులు చెరిగిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
హైదరాబాద్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను ఏకి పారేశారు. ఓ వైపు రోడ్డు ప్రమాదం జరిగితే పరామర్శించాల్సింది పోయి ఎస్ఎల్బీసీ పనులు ప్రారంభించడం ఏమిటంటూ ప్రశ్నించారు. మంగళవారం జగదీశ్ రెడ్డి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, నల్గొండ జిల్లా మంత్రులు హెలికాప్టర్ సర్వే చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయ నాయకులు టెక్నికల్ సర్వే చేయడం ఇదే మొదటిసారి అని ఎద్దేవా చేశారు. కెప్టెన్ హెలికాప్టర్ నడిపించారు వాటర్‌లో నీళ్లు కలిపే మంత్ర సర్వే చేశారంటూ మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ విషయంలో కాంగ్రెస్, టీడీపీ హయాంలోనే తెలంగాణకు ఎక్కువగా నష్టం జరిగిందన్నారు. దత్తత పేరుతో సమైక్య పాలకులు కోతలు కోశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీళ్ల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటి రంగం పట్ల అవగాహన లేదన్నారు. ఆయనకు నీళ్లంటే భయం, అంతకు మించి ఇరిగేషన్ అంశం అంటే వెనక్కి తగ్గుతాడంటూ ఫైర్ అయ్యారు జగదీశ్ రెడ్డి. 2013 లో ఉమ్మడి ఏపీలో కృష్ణా నది జలాల కేటాయింపులు జరిగాయన్నారు. తెలంగాణకు 299 టీఎంసీలు , ఏపీకి 512 టీఎంసీలు కేటాయించారని చెప్పారు. కేసీఆర్, హరీష్ రావు సంతకం పెట్టారని రేవంత్ రెడ్డి అంటున్నారని, చెప్పు దెబ్బకి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు. కేసీఆర్ సీఎం అయ్యాక కృష్ణా జలాల వాటా కోసం కమిషన్ ఏర్పాటు చేయించారని చెప్పారు. ఎస్ఎల్బీసీలో శవాలను బయటకు తీయలేని వాళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ నిప్పులు చెరిగారు.






