ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్సీ
ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ కనీస వసతులు లేక పోవడం పట్ల ఆవేదన చెందారు. దీనిపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్కడ పని చేస్తున్న డాక్టర్లు, ఇతర సిబ్బందితో మాట్లాడారు కల్వకుంట్ల కవిత. ఆస్పత్రిని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు .
ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రిలో పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోగులు, వైద్యులు, విద్యార్థులతో మాట్లాడిన తర్వాత, పారిశుధ్యం, వైద్య సిబ్బంది ,ప్రాథమిక సౌకర్యాలకు తక్షణ శ్రద్ధ అవసరమని తన పరిశీలనలో తేలిందని చెప్పారు కల్వకుంట్ల కవిత. ఈ జిల్లాలో గుండెపోటు కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నందున, తక్షణమే కార్డియాలజిస్ట్‌ను నియమించాలని ఆమె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.
నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను సమర్థవంతంగా అందించడానికి ప్రభుత్వం త్వరగా చర్య తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. తక్షణమే కనీస వసతి సౌకర్యాలపై దృష్టి సారించాలని అన్నారు.






