ఎక్స్‌ప్రెస్ ఇంగ్లీష్ 21 రోజుల్లో ప‌క్కా స‌క్సెస్

ఇంగ్లీష్ ట్రైన‌ర్ వి. రాఘ‌వేంద్ర అదుర్స్

టెక్నాల‌జీ పెరిగినా పుస్త‌కాలు చ‌ద‌వ‌డం మాన‌డం లేదు. ఇందుకు ఉదాహ‌ర‌ణ ప్ర‌ముఖ ఇంగ్లీష్ ట్రైన‌ర్ వి. రాఘ‌వేంద్ర రాసిన ఎక్స్‌ప్రెస్ ఇంగ్లీష్ 21 రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ పుస్త‌కం హాట్ కేకుల్లా అమ్ముడు పోతోంది. లాజిస్టిక్ దిగ్గ‌జ సంస్థ అమెజాన్ లో టాప్ హాట్ సేల్స్ బుక్స్ లో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింది. దీని ప్ర‌త్యేకత ఏమిటంటే ఇంగ్లీష్ రాని వాళ్లు ఎక్క‌డికీ వెళ్లాల్సిన ప‌ని లేదు. ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం అంత‌కంటే లేదు. కేవలం నేర్చు కోవాల‌న్న త‌పన ఉంటే చాలు. అర్థం చేసుకునే ఓపిక ఉంటే ఇక ఏదీ అక్క‌ర్లేదు. ఇక జ‌న్మ‌లో ఇంగ్లీష్ అంటే రాదేమోన‌ని, ఇక మాట్లాడ లేమోన‌ని, బిడియ ప‌డుతూ , మొహ‌మాటానికి గుర‌వుతూ, న‌లుగురిలో ఉన్నా మాట్లాడేందుకు రాక , లోలోప‌ట బాధ‌కు గుర‌వుతున్న వారంద‌రికీ ఇప్పుడు టానిక్ లా , అంతకు మించిన మందులా ప‌ని చేస్తోంది. ఒక్క‌సారి గ‌నుక ఈ పుస్త‌కాన్ని తీసుకుంటే, కొనుగోలు చేస్తే చాలు ఇక మీరు స‌క్సెస్ కావ‌డం ప‌క్కా. మ‌రి ఈ పుస్త‌కానికి ఉన్న ప్ర‌త్యేక‌త‌లు ఏంటి..? ఇత‌ర ట్రైన‌ర్స్ కంటే త‌ను ఎందుకు స్పెష‌ల్..? మార్కెట్ లో ఎన్నో పుస్త‌కాలు ఉన్నాయి. ఇదే ఎందుకు కొనుగోలు చేయాల‌నే అనుమానం త‌లెత్త‌క త‌ప్ప‌దు. అందుకు ప్ర‌త్యక్ష ఉదాహ‌ర‌ణ త‌నే.

ఇక్క‌డ రాఘ‌వేంద్ర చేయి తిరిగిన ర‌చ‌యిత‌నే కాదు మోటివేట‌ర్, ఇంగ్లీష్ ట్రైన‌ర్, కౌన్సెల‌ర్..టీచ‌ర్, అధ్యాప‌కుడు, మార్గ‌ద‌ర్శ‌కుడు, స్పూర్తి క‌లిగించే విధంగా త‌యారు చేసే నైపుణ్యం క‌లిగిన వ్య‌క్తి. త‌ను కూడా మ‌న‌లాగే బాధ ప‌డ్డాడు. ఇంగ్లీష్ రాద‌ని చింతించాడు. ఎందుకంటే త‌న నేప‌థ్యం గ్రామీణ ప్రాంతం. ఎక్క‌డో మారుమూల ఉన్న నారాయ‌ణ‌పేట జిల్లాలోని ల‌క్క‌ర్ దొడ్డి. త‌నకు మాతృ భాష‌లో మంచి ప‌ట్టుంది. కానీ రాణించాలంటే, పైకి ఎదగాలంటే, జాబ్ సంపాదించాలంటే, న‌లుగురిలో టాప్ లో క‌నిపించాలంటే ఇంగ్లీష్ త‌ప్ప‌నిస‌రిగా వ‌చ్చి ఉండాలి. ఇంట‌ర్వ్యూలకు సెలెక్టు అయినా ఎందుక‌ని ఫైన‌ల్ లో ఎంపిక కావ‌డం లేదంటే కేవ‌లం క‌మ్యూనికేష‌న్స్ స్కిల్స్ లేక పోవ‌డం , ఇంగ్లీష్ రాక పోవ‌డం. పోనీ అదేమైన బ్ర‌హ్మ విద్య‌నా అంటే కానే కాదు. కేవ‌లం నేర్చుకోవాల‌న్న క‌సి, ప్రేమ ఉండాలంతే. త‌ను ఓ మారుమూల ప‌ల్లె నుంచి వ‌చ్చి ఇప్పుడు టాప్ ఇంగ్లీష్ ట్రైన‌ర్, మోటివేట‌ర్, స్పీక‌ర్ గా ఎలా మారాడంటే క‌ష్ట‌ప‌డ్డాడు. ప‌ట్టుప‌ట్టి ఆంగ్ల భాష‌పై ప‌ట్టు సాధించాడు.

అనేక కోర్సులు చేశాడు. నిత్యం వంద‌లాది మందిని ఇంగ్లీష్ లో మాస్ట‌ర్స్ గా త‌యారు చేస్తున్నాడు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే కాకుండా ప‌ట్ట‌ణాల‌లో భాష రాక స‌త‌మ‌తం అవుతున్న వారిలో ధైర్యాన్ని నింపుతున్నాడు రాఘ‌వేంద్ర త‌న శిక్ష‌ణ‌తో. ఎంతో క‌ష్ట‌ప‌డి ప్ర‌తి ఒక్కరు సుల‌భంగా అర్థం చేసుకునేలా, ఎక్స్ ప‌ర్ట్స్ అయ్యేలా కేవ‌లం 21 రోజుల్లోనే ఇంగ్లీష్ లో అనర్ఘ‌లంగా మాట్లాడేలా చేసేందుకు ఓ పుస్త‌కాన్ని రాశాడు. ఈ పుస్త‌కం మీ చేతుల్లో ఉంటే చాలు మీరు త‌డుము కోకుండా మాట్లాడ‌టం ఖాయం. త‌ను వ‌శిష్ట 360 ఫౌండ‌ర్ వంశీతో క‌లిసి ముందుకు సాగుతున్నాడు రాఘ‌వేంద్ర‌. పుస్త‌కం కొనుగోలు చేయండి..ప‌ది మందికి చెప్పండి..ఆంగ్లంలో ప‌ట్టు సాధించేందుకు ప్ర‌య‌త్నం చేయండి. ఇంత మంచి పుస్త‌కాన్ని తీసుకు వ‌చ్చినందుకు రాఘ‌వేంద్ర‌కు అభినంద‌న‌లు. రాబోయే రోజుల్లో మ‌రిన్ని పుస్త‌కాలు రాయాల‌ని ఆశిస్తూ.

  • Related Posts

    సీఎంను క‌లిసిన అన‌లాగ్ ఏఐ సీఈవో

    తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు ఆహ్వానం హైద‌రాబాద్ : ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ కంపెనీ అన‌లాగ్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సీఈఓ) అలెక్స్ కిప్ మాన్ హైద‌రాబాద్ లో మ‌ర్యాద పూర్వ‌కంగా గురువారం సీఎం ఎ. రేవంత్ రెడ్డిని…

    కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం

    విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి హైద‌రాబాద్ : రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఇప్ప‌టికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించింది. ఇదే ఊపును స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో చూపించాల‌ని అనుకుంటోంది. ప్ర‌ధాన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *