రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌పై ఫోక‌స్ పెట్టాలి

స్ప‌ష్టం చేసిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

హైద‌రాబాద్ : రోజు రోజుకు రోడ్డు ప్ర‌మాదాలు పెరుగుతుండ‌డం ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్. రవాణా శాఖ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ గ్రామీణ స్థాయిలో కూడా కార్యక్రమాలు నిర్వహించేలా యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఆర్టీఏ మెంబెర్స్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నాన్ ఆఫీసియల్ మెంబెర్స్ కి హోటల్ మెర్క్యూరీ లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది . ఇటీవల కర్నూలు బస్సు ప్రమాదం ,చేవెళ్ల బస్సు ప్రమాదాలు జరిగిన తీరు పై వెల్లడించడం జరిగింది . రోడ్డు ప్రమాదాలను నివారించడానికి స్కూల్ లు కాలేజీలు ,విద్యా సంస్థల్లో రోడ్డు నిబంధనల పై వ్యాస రచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్ర‌ధానం చేయాల‌ని సూచించారు మంత్రి. కరపత్రాలు పంపిణీ చేయాలని, గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలన్నారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకొని మరణాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు .

కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అమలు చేస్తుందని వెల్లడించారు పొన్నం ప్ర‌భాక‌ర్. లక్షా 50 వేల రూపాయలు 8 రోజుల్లో చికిత్స కు అందిస్తారని సూచించారు. దీనిపై ప్రజల్లో విసృత అవగాహన కల్పించాలని స్ప‌ష్టం చేశారు. యూనిసెఫ్ ప్రతినిధి డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీస్ రిపోర్ట్ ప్రకారం 10-19 సంవత్సరాల్లో మరణిస్తున్న వారు ప్రధానంగా రోడ్డు ప్రమాదాల‌కు గురి కావ‌డం వ‌ల్ల‌నే జ‌రుగుతోంద‌న్నారు. యూనిసెఫ్ మూడు దేశాల్లో అవగాహన కల్పించడానికి ఎంపిక చేయగా మన దేశం నుండి అహ్మదాబాద్ , ముంబై , హైదరాబాద్ పట్టణాలను ఎంపిక చేసినట్టు చెప్పారు. దేశంలో సగటున 1317 రోడ్డు ప్రమాదాలు జరుగు తున్నాయని వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ డాక్టర్ శైలజ తో ఆయా జిల్లాల‌కు చెందిన ఆర్టీఏ మెంబ‌ర్స్ హాజ‌ర‌య్యారు.

  • Related Posts

    సీఎంను క‌లిసిన అన‌లాగ్ ఏఐ సీఈవో

    తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు ఆహ్వానం హైద‌రాబాద్ : ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ కంపెనీ అన‌లాగ్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సీఈఓ) అలెక్స్ కిప్ మాన్ హైద‌రాబాద్ లో మ‌ర్యాద పూర్వ‌కంగా గురువారం సీఎం ఎ. రేవంత్ రెడ్డిని…

    కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం

    విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి హైద‌రాబాద్ : రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఇప్ప‌టికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించింది. ఇదే ఊపును స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో చూపించాల‌ని అనుకుంటోంది. ప్ర‌ధాన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *