అయ్యప్ప భక్తుల పూజలో పాల్గొన్న మంత్రి
అమరావతి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి లోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి మాలలు ధరించారు. వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ మధు నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, భవానీలతో పాటు పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప స్వామి మాలాధారణ చేపట్టిన భక్తులకు పెద్ద ఎత్తున మహా ప్రసాదం పంపిణీ చేశారు. స్వయంగా పాల్గొన్నారు మంత్రి. వారికి పండ్లు, ఫలహారాలు, ఇతర ప్రసాదాలను అందించారు. అయ్యప్ప స్వామి కరుణ కటాక్షం అయ్యప్ప స్వాములకు కలగాలని ఆ దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు లోకేష్. తమ ప్రభుత్వం ఆలయాల అభివృద్దికి కృషి చేస్తోందని చెప్పారు.







