చేనేత రంగాన్ని బ‌లోపేతం చేస్తాం

ప్ర‌క‌టించిన మంత్రి నారా లోకేష్‌

విజ‌య‌వాడ : ఏపీ వైద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో చేనేత రంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం విజయవాడ ఎంజీ రోడ్డులోని శ్రీ శేషసాయి కల్యాణ వేదికలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వసంతం-2025’ చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత, చేతివృత్తుల కార్మికులు తయారు చేసిన వివిధ ఉత్పత్తులతో ఉన్న 70కిపైగా స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు. ప్రకృతి సహజసిద్ధ రంగులతో తయారు చేసిన ‘కొత్తూరు వసంత వర్ణ’ నూతన చేనేత బ్రాండ్ ను మంత్రి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఎస్.రంజన, ఇతర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సుజాత, సౌభాగ్యలక్ష్మి, పద్మ, శైలజ పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా త‌యారు చేసిన ఉత్ప‌త్తుల‌ను ప‌రిశీలించారు. త‌యారీదారుల‌తో సంభాషించారు. ప్ర‌తిభా, నైపుణ్యం క‌లిగిన క‌ళాకారులు, చేతి వృత్తి ప‌నివార‌ల‌ను గుర్తిస్తామ‌న్నారు. వారికి అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చారు. గ‌త స‌ర్కార్ చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసింద‌న్నారు. కానీ తాము వ‌చ్చాక ప్ర‌యారిటీ ఇస్తున్న‌ట్లు తెలిపారు. ఏపీ చేనేత బ్రాండ్ ను విస్త‌రించేలా చేస్తామ‌న్నారు నారా లోకేష్‌.

  • Related Posts

    సీఎంను క‌లిసిన అన‌లాగ్ ఏఐ సీఈవో

    తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు ఆహ్వానం హైద‌రాబాద్ : ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ కంపెనీ అన‌లాగ్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సీఈఓ) అలెక్స్ కిప్ మాన్ హైద‌రాబాద్ లో మ‌ర్యాద పూర్వ‌కంగా గురువారం సీఎం ఎ. రేవంత్ రెడ్డిని…

    కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం

    విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి హైద‌రాబాద్ : రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఇప్ప‌టికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించింది. ఇదే ఊపును స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో చూపించాల‌ని అనుకుంటోంది. ప్ర‌ధాన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *