త‌క్ష‌ణ‌మే జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేయాలి

స‌ర్కార్ ను డిమాండ్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత

ఆదిలాబాద్ జిల్లా : కాంగ్రెస్ స‌ర్కార్ బ‌క్వాస్ అంటూ మండిప‌డ్డారు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా సెంట్రల్ లైబ్రరీ సందర్శించారు. ఈ సంద‌ర్బంగా నిరుద్యోగులతో మాట్లాడారు. అధికారంలోకి వ‌స్తే 2 లక్ష‌ల జాబ్స్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించార‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం 20 వేల జాబ్స్ కూడా భ‌ర్తీ చేసిన దాఖలాలు లేవ‌న్నారు. జాబ్ క్యాలెండ‌ర్ ఇస్తామ‌న్నార‌ని, అది ఎక్క‌డుందో చెప్పాల‌ని ఆమె నిల‌దీశారు. త‌క్ష‌ణ‌మే జాబ్ క్యాలెండ‌ర్ ను విడుద‌ల చేయాల‌ని క‌విత డిమాండ్ చేశారు. చాలా మంది జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నార‌ని, లైబ్ర‌రీలో వారంతా క‌ష్ట‌ప‌డి చ‌దువుకుంటున్నార‌ని, ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నార‌ని ఈ స‌మ‌యంలో నోటిఫికేష‌న్స్ వేయ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

ఇలా ఎంత కాలం జ‌నాన్ని, నిరుద్యోగుల‌ను మోసం చేస్తారంటూ ప్ర‌శ్నించారు క‌విత‌. అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిప‌డ్డారు. డీఎస్సీ, ఫార్మసీ, గ్రూప్స్ కోసం వారంతా ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తదో అర్థం కాని పరిస్థితి ఉందంటూ వాపోయార‌ని అన్నారు. ఏ అనిశ్చితి ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చారో ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి ఉంద‌న్నారు. జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించేంత దాకా తాము వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తి లేద‌న్నారు క‌విత‌. తాము ఎక్కడికి వెళ్లినా సమస్యలు వెల్ కం చేస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని సమస్యలకు రాష్ట్రమొక్కటే పరిష్కారం అనుకున్నాం. రాష్ట్రం వచ్చాక కొన్ని సమస్యలు పరిష్కరించు కున్నాం. కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసుకున్నామ‌ని, కానీ ఇంకా ప‌రిష్కారం కాని వేలాది స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని ఆవేద‌న చెందారు క‌విత‌.

  • Related Posts

    ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఏపీ నెంబ‌ర్ వ‌న్

    ప్ర‌క‌టించిన మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ రంగంలో ఏపీ టాప్ లో ఉంద‌న్నారు. ఈ 17 నెలల కాలంలో సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా నెరవేరుస్తూ…

    రైతుల‌ను బ‌లోపేతం చేయ‌డంలో నాబార్డ్ కృషి

    స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్ : ఈ దేశానికి వెన్నెముక‌గా రైతులు ఉన్నార‌ని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. రైతుల‌కు అన్ని విధాలుగా అండ‌గా ఉంటూ వారిని మ‌రింత అభివృద్ది చేసేందుకు ప్ర‌య‌త్నం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *