ప్రకటించిన ఆ పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్
హైదరాబాద్ : తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నికలో తమ పార్టీ తరపున భారతీయ జనతా పార్టీ నుంచి బరిలోకి దిగిన లంకాల దీపక్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు తన సారథ్యంలో పార్టీకి చెందిన కీలక నేతలంతా మర్యాద పూర్వకంగా కలిశారు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావును, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని. బేషరతుగా తమ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల ఆదేశాల మేరకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం మూడు పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మడం లేదని, నియోజకవర్గంలోని ప్రజలంతా మూకుమ్మడిగా బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్. కేంద్ర మంత్రిని, రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన వారిలో జీహెచ్ఎంసీ అధ్యక్షులు రాధారాం రాజలింగం, ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పార్టీ తరపున నేతలు, కార్యకర్తలు మూకుమ్మడిగా అభ్యర్థి గెలుపు కోసం ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు శంకర్ గౌడ్.






