అజ‌హ‌రుద్దీన్ కు కోడ్ వ‌ర్తించ‌దా..?

Spread the love

మాజీ ఎంపీ వినోద్ కుమార్ కామెంట్స్

హైద‌రాబాద్ : రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని ఆరోపించారు మాజీ ఎంపీ బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్.
బీఆర్ఎస్‌కు ఓటేస్తే జూబ్లీహిల్స్‌కు రానని మంత్రి మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ చెప్ప‌డం న్నిక‌ల కోడ్ కింద‌కు రాదా అని ప్ర‌శ్నించారు. మీరు ఓటు వేయ‌క పోతే సంక్షేమ ప‌థ‌కాలు నిలిపి వేస్తానంటూ బహిరంగంగానే ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోరా అని ప్ర‌శ్నించారు మాజీ ఎంపీ . కాంగ్రెస్ అభ్యర్థి న‌వీన్ యాద‌వ్ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం ఎలా చేస్తారో చూస్తా అని బెదిరించడం కోడ్ ఉల్లంఘన కాదా అని , ఇది ఈసీకి , అధికారుల‌కు క‌నిపించ‌డం లేదా అని మండిప‌డ్డారు . ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఈసీ కావాల‌ని వివ‌క్ష చూపిస్తోంద‌ని ఆరోపించారు.

ఇదే అంశంపై ఫిర్యాదు కూడా చేయ‌డం జ‌రిగింద‌న్నారు బోయ‌న‌ప‌ల్లి వినోద్ కుమార్. ఇక్కడి ఎన్నికల ప్రధానాధికారికి ప్రతిరోజూ త‌మ పార్ట‌కి చెందిన‌ నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోక పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవుడు సీఈఓ నిష్పక్షపాతంగా వ్యవహరించాల‌న్నారు మాజీ ఎంపీ. సుదర్శన్ రెడ్డి త‌మ‌ ఫిర్యాదులపై ఎందుకు స్పందించడం లేద‌ని ప్ర‌శ్నించారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌కు కనీసం ఎందుకు నోటీసులు ఇవ్వడం లేద‌ని మండిప‌డ్డారు. ఈసీ పక్షపాత వైఖరిపై హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళతామ‌న్నారు. ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు భవనానికి 8 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఎలా లేఖ రాస్తారంటూ ప్ర‌శ్నించారు. త‌న‌పై ఈసీ చ‌ర్య‌లు తీసుకోదా అని నిల‌దీశారు వినోద్ కుమార్.

  • Related Posts

    6 నుంచి ప్ర‌జా పాల‌న ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక‌

    Spread the love

    Spread the loveరాష్ట్ర ప్ర‌ణాళిక నోడ‌ల్ ఏజెన్సీగా ప్లాన్ హైద‌రాబాద్ : రాష్ట్రంలో మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రభుత్వం నిర్వహించనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని అయిదు దశల్లో…

    పశు సంవర్ధక రంగానికి పునర్వైభవం

    Spread the love

    Spread the loveఉత్పత్తి వృద్ధి, రైతు ఆదాయం పెంపే లక్ష్యం అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న‌ చేశారు. రాష్ట్రంలో పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో గత ప్రభుత్వ హయాంలో నమోదైన పడిపోయిన వృద్ధి రేటును…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *