సామాజిక త‌త్వ‌వేత్త‌ శ్రీ భ‌క్త క‌న‌క‌దాస

నివాళులు అర్పించిన మంత్రి లోకేష్

అనంత‌పురం జిల్లా : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌ముఖ సామాజిక త‌త్వ‌వేత్త‌, స్వ‌ర‌క‌ర్త‌, కురుబ‌ల ఆరాధ్య దైవం శ్రీ భ‌క్త దాస 538వ జ‌యంతి ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు. పెద్ద ఎత్తున ప్ర‌జా ప్ర‌తినిధులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా శ‌నివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సామాజిక తత్వవేత్త, స్వరకర్త, కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాస 538వ జయంతి ఉత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణ, హిందూపురం రోడ్డు, బైపాస్ సర్కిల్ లో స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు.

బైపాస్ సర్కిల్‌కు శ్రీ భక్త కనకదాస సర్కిల్‌గా నామకరణం చేశారు మంత్రి . ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, ఎస్.సవిత, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీ నారాయణ, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులు వెంకట శివుడు, ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, కందికుంట వెంకట ప్రసాద్, గుమ్మనూరు జయరాం, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, బండారు శ్రావణిశ్రీ, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    ప‌ద్మావ‌తి అమ్మ‌వారి స‌న్నిధిలో రాష్ట్ర‌ప‌తి

    భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుప‌తి : తిరుప‌తిలోని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా గురువారం భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అమ్మ వారి ఆల‌యానికి చేరుకున్నారు.…

    స‌త్య‌సాయి బాబా స్పూర్తి తోనే జ‌ల్ జీవ‌న్ మిష‌న్

    ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *