శ్రీ ప‌ద్మావ‌తి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

Spread the love

వెల్ల‌డించిన టీటీడీ జేఈవో వి.వీర‌బ్ర‌హ్మం

తిరుపతి : నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్నాయి తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్స‌వాల‌ను పురస్కరించుకొని నవంబరు 11వ తేది మంగళవారం నాడు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్ర నామార్చాన, శుధ్ధి నిర్వహించనున్నారు.

ఆనంతరం ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి సర్వ దర్శనానికి అనుమతిస్తారు.

బ్రహ్మోత్సవాల కారణంగా నవంబరు 11న, నవంబరు 17 నుంచి 25వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించారు టీటీడీ జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం.

  • Related Posts

    ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు

    Spread the love

    Spread the loveఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుపతి : టీటీడీ ఆధ్వ‌ర్యంలో మార్చి 9న నిర్వ‌హించ‌నున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా…

    వైభవంగా కుమార ధార తీర్థ ముక్కోటి

    Spread the love

    Spread the loveప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌కు అనుమ‌తి తిరుమల : తిరుమలలో కుమార ధార తీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహించారు. చంద్ర గ్రహణం కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను తీర్థానికి అనుమతించారు. శ్రీవారి సేవకుల సహకారంతో టీటీడీ అన్న ప్రసాద విభాగం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *