నీటి వ‌న‌రుల‌ను సంర‌క్షించుకోక పోతే ప్ర‌మాదం

పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్

అమ‌రావ‌తి : నీటి వనరులను సంరక్షించుకోక పోతే భవిష్యత్తు తరాలు నీటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చ‌రించారు రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్. భూగర్భ జలాలను పెంపొందించు కోవడం, భూ సారాన్ని కాపాడు కోవడం, సాగునీటిని సద్వినియోగం చేసుకోవడం మనందరి బాధ్యత అని స్ప‌ష్టం చేశారు. నీటి వృథాను పూర్తిగా నిరోధిస్తూ, ప్రతి గ్రామంలో చెరువులు, కెనాళ్లను పునరుద్ధరించే కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధికి దోహదపడే పలు సంఘాలకు చెక్కుల పంపిణీ చేయ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాన‌ని చెప్పారు.

గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో జరిగిన వాటర్ షెడ్ మహోత్సవ్ జాతీయ సదస్సు కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , కేంద్ర కమ్యూనికేషన్లు , గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి లక్ష్యాలకు కీలకంగా నిలిచే ఈ కార్యక్రమం, మన రాష్ట్రంలో నీటి వనరుల సంరక్షణ, గ్రామీణ అభివృద్ధి పనులకు మరింత బలం చేకూరుస్తుందని చెప్పారు. రానున్న కాలంలో 10 కోట్ల మందిని లక్‌పత్ లుగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని ప్రకటించడం చాలా సంతోషకరం అన్నారు దుర్గేష్.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *