ఘనంగా ఏర్పాట్లు చేసిన టీటీడీ
తిరుపతి : పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టిటిడి ఆధ్వర్యంలో నవంబరు 14వ తేదీన తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇందు కోసం పరిపాలన మైదానంలో కార్తీక దీపోత్సవాలు నిర్వహించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ఇదిలా ఉండగా ఈనెల 17 నుంచి 25వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు జేఈవో వీరబ్రహ్మం ఆధ్వర్యంలో.
ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమ్మ వారికి పట్టు వస్త్రాలను ఈనెల 17వ తేదీ సాయంత్రం రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి సమర్పిస్తారని తెలిపారు జేఈవో. అంతే కాకుండా భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతారని, కోరిన కోర్కెలు తీర్చే శ్రీ పద్మావతి అమ్మ వారని దర్శించుకుంటారని, అనంతపురం పూజలు చేస్తారని వెల్లడించారు. ప్రతి రోజూ వేలాది మంది సుదూర ప్రాంతాల నుంచి రానున్నారని, పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు జేఈవో.






