సైబ‌ర్ చీట‌ర్స్ బారిన ప‌డ్డాం : నాగార్జున‌

ఉచిత సినిమాల‌ను చూస్తే డేటా చోరీ

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ కుటుంబం కూడా సైబ‌ర్ చీట‌ర్స్ బారిన ప‌డింద‌న్నాడు. అందుకే ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించాడు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పోలీసులు ముఖ్యంగా సిటీ పోలీస్ క‌మిష‌నర్ వీసీ స‌జ్జ‌నార్ ఆధ్వ‌ర్యంలో పోలీసుల‌కే స‌వాల్ గా మారిన ఐబొమ్మ , బొప్పం సంస్థ‌ల నిర్వాహ‌కుడు, అడ్మిన్ ఇమ్మ‌డి ర‌వి కుమార్ ను అరెస్ట్ చేయ‌డం ప‌ట్ల థ్యాంక్స్ తెలిపారు. వారిని ప్ర‌త్యేకంగా అభినందిస్తున్న‌ట్లు తెలిపారు. 21 వేల‌కు పైగా సినిమానల‌ను అప్ లోడ్ చేయ‌డంతో పాటు రూ. 20 కోట్లు సంపాదించాడ‌ని తెలుసుకుని తాము ఆశ్చ‌ర్యానికి లోనైన‌ట్లు తెలిపారు.

కానీ వాస్త‌వానికి త‌న నిర్వాకం, చోరీ కార‌ణంగా టాలీవుడే కాదు ఇత‌ర సినీ ప‌రిశ్ర‌మ‌లు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను కోల్పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు అక్కినేని నాగార్జున‌. ఇలాంటి వారి వ‌ల్ల మ‌న డేటా అనుకోకుండా మ‌న‌కు తెలియ‌కుండానే చోరీకి గుర‌వుతుంద‌ని తెలిపాడు. అందుకే ప్ర‌తి ఒక్క‌రు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించాడు న‌టుడు. త‌ను రూ. 20 కోట్లు సంపాదించాడ‌ని సీపీ చెబుతున్నార‌ని కానీ త‌న వ‌ర‌కు మాత్రం ఇమ్మ‌డి ర‌వి ఏకంగా వంద‌ల కోట్లు పోగేసి ఉంటాడ‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. ఏది ఏమైనా ఒక సైబ‌ర్ నేర‌స్తుడు ప‌ట్టుబ‌డ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు అక్కినేని నాగార్జున‌.

  • Related Posts

    అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం వాడాడు

    ఐబొమ్మ ర‌విపై సీపీ స‌జ్జ‌నార్ షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : ఐ బొమ్మ ఫౌండ‌ర్ ఇమ్మ‌డి ర‌వి కొట్టిన దెబ్బ‌కు టాలీవుడ్ విల విల లాడింది. ఈ సంద‌ర్బంగా క‌రేబియ‌న్ దీవుల‌లో ఉంటూ ఈ వెబ్ సైట్ ద్వారా వేలాది సినిమాల‌ను…

    రామోజీరావును స్పూర్తిగా తీసుకోవాలి : రేవంత్ రెడ్డి

    ప్ర‌తీ రంగంలో త‌న‌దైన ముద్ర వేశార‌ని కితాబు హైద‌రాబాద్ : రామోజీ రావు ఎదిగిన తీరు అద్భుత‌మ‌ని, ఆయ‌నను స్పూర్తిగా తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రామోజీ ఫిలిం సిటీలో రామోజీ ఎక్స‌లెన్స్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం జ‌రిగింది. ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *