ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఏపీ నెంబ‌ర్ వ‌న్

Spread the love

ప్ర‌క‌టించిన మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ రంగంలో ఏపీ టాప్ లో ఉంద‌న్నారు. ఈ 17 నెలల కాలంలో సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా నెరవేరుస్తూ ప్రాథమిక వ్యవసాయ రంగంలోని వ్యవసాయం , ఆక్వా కల్చర్ ,ఉద్యాన ,పట్టు శాఖలలో, పశు పోషణ , పాల ఉత్పత్తి , మాంసం ఉత్పత్తిలో ప్రగతి చూపటంలో మన రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉంద‌న్నారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు మద్దతుగా నిలుస్తున్నది కూటమి ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఇన్ పుట్ సబ్సిడీ విషయములో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రు.310 కోట్ల మేర అందించడం జరిగిందన్నారు . మోoత (Montha) తుఫానుకు నష్ట పోయిన‌ 3.26 లక్షల మంది రైతులకు రు.390 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించ బోతున్నాం అని ప్ర‌క‌టించారు.

పంటల భీమా విషయంలో ప్ర‌ధాన‌మంత్రి ఫసల్ బీమా యోజన , వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తూ, మామిడి పంటను కూడా మొదటిసారిగా భీమా పరిధిలోకి తేవటం జరిగిందని తెలిపారు . భీమా పొందడానికి పంటకు జరిగిన నష్టాన్ని అంచనా నమోదు చేయటానికి , దిగుబడుల వివరాలను తెలుసు కునేందుకు శాటిలైట్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని చెప్పారు కింజ‌రాపు అచ్చెన్నాయుడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల నుంచి రు.15,955/- కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి ,కేవలం 24 నుండి 48 గంటలలోపు చెల్లించామని తెలిపారు . వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ ధరల వ్యత్యాసం ఏర్పడినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా సరైన మద్దతు ఇవ్వడం , రైతు బజార్లు , మార్కెట్ సౌకర్యాలను విస్తృత పరచటం చేయడం జరిగిందని తెలిపారు.

  • Related Posts

    జాతీయ ర‌హ‌దారుల అభివృద్దికి నిధులు ఇవ్వండి

    Spread the love

    Spread the loveకేంద్ర ప్ర‌భుత్వానికి విన్న‌వించిన బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్రంలో ఉన్న జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌కు సంబంధించి త‌క్ష‌ణ‌మే నిధులు మంజూరు చేయాల‌ని కోరారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి.…

    కేర‌ళ‌ను విమ‌ర్శించే హ‌క్కు రేవంత్ రెడ్డికి లేదు

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్ కేర‌ళ : త‌న‌తో పాటు కేర‌ళ రాష్ట్రం గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు ముఖ్య‌మంత్రి పిన‌ర‌య్ విజ‌య‌న్. ఇటీవ‌ల కేరళ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *