ఆయనకు అంత సీన్ లేదన్న గౌడ్
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలం పాటు సేవలు అందిస్తూ వచ్చిన మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి తను పార్టీ వీడడం పట్ల సర్వత్రా చర్చకు దారి తీసింది. త్వరలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఏకి పారేస్తున్నారు. సంచలన ఆరోపణలు కూడా చేశారు. రేవంత్ రెడ్డిని మారిస్తేనే కానీ రాష్ట్రం అభివృద్ది చెందదన్నారు. కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. సంక్షేమ పథకాలను పక్కన పెట్టారని మండిపడ్డారు.
ఈ సందర్బంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన దారుణమైన కామెంట్స్ పై స్పందించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తనంటే తమకు కూడా గౌరవం ఉందన్నారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు తాను, మంత్రి శ్రీధర్ బాబు తనను నచ్చచెప్పే ప్రయత్నం చేశామన్నారు. కానీ తను వినిపించు కోలేదన్నారు. తెలంగాణలో ప్రతిపక్షమే లేదని, ఇక జీవన్ రెడ్డి ఏ పార్టీలోకి వెళతారంటూ ప్రశ్నించారు. ఆయన తిరిగి తమ పార్టీలోకి రావాల్సిందేనని జోష్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. అది దోపిడీ చేసిన పార్టీ. ఇక బీజేపీ మతం, కులం తప్ప ఆ పార్టీకి అంత సీన్ లేదన్నారు.






