newsseals.com
News

రేవంత్ రెడ్డి చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలే : హ‌రీశ్ రావు

VijayaBhaskar April 4, 2026
newsseals-HarishRao
Spread the love

ఏం సాధించావ‌ని కేర‌ళ‌కు వెళ్లావో చెప్పాలి

హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడారు. నోరు తెరిస్తే అబ‌ద్దాలు త‌ప్పా ఇప్ప‌టి వ‌ర‌కు సీఎంగా కొలువుతీరిన నాటి నుంచి ఒక్క నిజం మాట్లాడిన పాపాన పోలేద‌న్నారు. త‌న‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, ఆ విష‌యం తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. ఇక్క‌డ ఏం సాధించాడ‌ని కేర‌ళ‌కు పోయి గ‌ప్పాలు చెప్పాడంటూ ఎద్దేవా చేశారు హ‌రీశ్ రావు. తెలంగాణలో అన్ని హామీలు అమలు చేశామని అబద్ధాలు చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. అలా మాట్లాడుతుంటే సిగ్గు అనిపించ‌డం లేదా అని ప్ర‌శ్నించారు.

ఏం హామీలు అమలు చేశావ్ నాయ‌న అంటూ ఫైర్ అయ్యారు. నిన్న జరిగిన గ్రామ సభల్లో కాంగ్రెస్ నాయకుల మీద ప్రజలు తిరగబడ్డారని, అది తెలుసుకోకుండా మాట్లాడటం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు హ‌రీశ్ రావు. చెప్పింది 2 లక్షల ఉద్యోగాలని, కానీ ఇచ్చింది మాత్రం కేవ‌లం 16 వేల జాబ్స్ మాత్ర‌మేన‌ని , ఆవిష‌యం నిరుద్యోగుల‌ను అడిగితే తెలుస్తుంద‌న్నారు. ఈ చేదు వాస్త‌వం అసెంబ్లీ సాక్షిగా తేలి పోయింద‌న్నారు. తాము ప్ర‌శ్న‌లు అడుగుతుంటే చెప్ప‌కుండా ముఖం చాటేశాడంటూ సీఎంపై భ‌గ్గుమ‌న్నారు హ‌రీశ్ రావు.