జ‌న‌సేన ఎమ్మెల్యేపై ఈసీ విచార‌ణ‌కు ఆదేశం

పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు కోలుకోలేని షాక్

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం , జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. ఈ మేర‌కు త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యే లోకం నాగ మాధ‌వి వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మారింది. త‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇందులో భాగంగా ఎమ్మెల్యేపై సీరియ‌స్ అయ్యింది ఈసీ. విచార‌ణ చేయాల‌ని ఆదేశించింది. మిరకల్ సాఫ్ట్‌వేర్ మాజీ ఉద్యోగి ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈమేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ వెంట‌నే విచార‌ణ చేప‌ట్టాల‌ని స్ప‌ష్టం చేసింది.

స‌ద‌రు సాఫ్ట్ వేర్ కంపెనీలో ప‌ని చేస్తున్న 300 మంది ఉద్యోగుల ఖాతాల్లోకి అదనపు నగదు జమ కావ‌డం, తిరిగి ఆ నగదును వెనక్కి తీసుకుని ఎన్నికల ఖర్చుకు వినియోగం చేసిన‌ట్లు ఆరోపించారు బాధితుడు ఫిర్యాదులో. ‘వేతనాల రౌండ్ ట్రిప్పింగ్’ ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విజయనగరం కలెక్టర్‌ను ఆదేశించింది ఎన్నికల సంఘం. ఇదిలా ఉండ‌గా విచార‌ణ‌కు ఆదేశించ‌డం జ‌న‌సేన పార్తీలో క‌ల‌క‌లం రేపింది. దీనిపై మాట్లాడేందుకు అన్న‌ద‌మ్ములు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాగ‌బాబులు ఇంకా స్పందించ లేదు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *