నాకు టికెట్ వ‌ద్ద‌ని బీజేపీకి ముందే చెప్పా

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మాజీ చీఫ్ కె అన్నామ‌లై

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ కె అన్నామ‌లై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా త‌నకు పార్టీ ప‌రంగా ప్ర‌క‌టించిన తొలి అభ్య‌ర్థుల జాబితాలో త‌న పేరు లేక పోవ‌డం ప‌ట్ల స్పందించాడు. ఈ మేర‌కు స్పందిస్తూ తన‌కు టికెట్ ఇవ్వాల‌ని కోర‌లేద‌న్నాడు. తాను బీజేపీ హైక‌మాండ్ కు ఇదే విష‌యాన్ని వెల్ల‌డించ‌డం జ‌రిగింద‌న్నారు. తాను ఏ నియోజకవర్గం నుంచీ పోటీ చేయనని కోర్ కమిటీకి ఇప్పటికే లిఖిత పూర్వకంగా తెలియ చేసిన‌ట్లు తెలిపారు కె. అన్నామ‌లై.

అయితే త‌న‌కు కావాల‌ని టికెట్ ఇవ్వ‌లేదంటూ కొంద‌రు దుష్ప్ర‌చారం చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ చీఫ్‌. ఇప్ప‌టికే త‌న‌కు ఏ ప‌ద‌వి ఇవ్వ‌వ‌ద్ద‌ని కోరాన‌ని ఇక టికెట్ ఇచ్చే ప్ర‌స‌క్తి ఉండ‌ద‌న్నారు. కాబట్టి, నాకు టికెట్ నిరాకరించారన్నది నిజం కాదన్నారు. వాస్తవం ఏమిటంటే, నేనే పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విషయం మీడియాలో చర్చనీయాంశంగా మారినందున, నేను ఇక్కడ దీనిపై స్పష్టత ఇస్తున్నానని తెలిపారు. నా నిర్ణయాన్ని గౌరవించి ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసే అవకాశాన్ని కల్పించినందుకు బీజేపీ నాయకత్వానికి నేను కృతజ్ఞతలు తెలియ జేస్తున్నానని అన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *