ఎన్జీటీ డిస్పోజ‌ల్ చేసింది కానీ డిస్మిస్ చేయ‌లేదు

మూసీ ప్రాజెక్టుపై కేసు కొన‌సాగుతుందన్న కార్తీక్ రెడ్డి

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ప‌టోళ్ల కార్తీక్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా కాంగ్రెస్ స‌ర్కార్ త‌ల‌పెట్టిన మూసీ పున‌ర్ నిర్మాణం పేరుతో చేప‌ట్టిన ప్రాజెక్టుపై తాను నేష‌న‌ల్ గ్రీన్ ట్రైబ్యూన‌ల్ లో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీని వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పు ఏర్ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. ఈ త‌రుణంలో కేసును విచారించింది ఎన్జీటీ . ఈ సంద‌ర్భంగా కీల‌క సూచ‌న‌లు చేసింది. అయితే మూసీ ప్రాజెక్టుపై తాను వేసిన NGT కేసు డిస్మిస్ అయినట్లు జ‌రుగుతున్న ప్ర‌చారం పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని అన్నారు. ప‌టోళ్ల కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

డిస్మిసల్ వేరు డిస్పోజల్ వేరు, మీడియా వాళ్లు అది గమనించకుండా సీఎంవో నుండి వచ్చిన లీకులతో నిరాధార‌మైన వార్త‌లు ప్ర‌చురిస్తున్నార‌ని ఆరోపించారు. డిస్పోజల్ అంటే మనం అడిగిన ప్రశ్నలకు, లేవనెత్తిన వివాదాలకు పాల్పడకుండా ప్రభుత్వానికి మార్గదర్శకాలు ఇవ్వడం అని అన్నారు. మూసీలో MFL, FTL లెవెల్స్ ఫిక్స్ కాలేదన్నారు, ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తాను NGT లో పిటిషన్ దాఖలు చేశాన‌ని చెప్పారు. దానికి జడ్జి స్పందిస్తూ, ప్రభుత్వం మీరు లేవనెత్తిన అంశాలు పరిగణనలోకి తీసుకుంటానని చెప్పింది కదా, ఒకవేళ అవి ఉల్లంఘిస్తే తిరిగి మమ్మల్ని ఆశ్రయించండి అని చెప్పార‌న్నారు. మా పిటిషన్ డిస్పోజల్ చేసింది కానీ డిస్మిస్ చేయలేదని నొక్కి చెప్పారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *