ఓట్ల చోరీ చేయ‌డం వ‌ల్లే ఎన్డీయే గెలిచింది

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్

హైద‌రాబాద్ : ఏపీకి చెందిన ప్ర‌ముఖ మేధావి, రాజ‌కీయ అన‌లిస్ట్ , ర‌చ‌యిత ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌త కొంత కాలంగా మోదీ స‌ర్కార్ ను , అది చేస్తున్న అప్ర‌జాస్వామిక ప‌నుల గురించి ఏక‌రువు పెడుతూ వ‌స్తున్నారు. ఈ దేశంలో ప్ర‌జాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేస్తున్నారో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చెబుతున్నారు. ఆపై ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేస్తూ వ‌స్తున్నారు. ఈ సంద‌ర్బంగా స‌మావేశాలు, వ‌రుస సెమినార్ల‌తో బిజీగా ఉన్నారు. తాజాగా జాతీయ మీడియా ట్రైబ్ తో జ‌రిగిన చిట్ చాట్ సంద‌ర్బంగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్.

భార‌త దేశంలో 2024లో జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో భారతీయ జ‌న‌తా పార్టీ, దాని అనుబంధ పార్టీల‌తో కూడిన ఎన్డీయే ఓట్ల చోరీకి పాల్ప‌డింద‌ని ఆరోపించారు. అందువ‌ల్ల‌నే దేశంలో తిరిగి మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చింద‌న్నారు. నిస్సిగ్గుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం మోదీకి, అమిత్ షా ప‌రివారానికి మేలు చేకూర్చేలా చేసింద‌ని మండిప‌డ్డారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్. ఓటు చోరీ గ‌నుక జరగక పోయి ఉంటే.. 316 సీట్లతో INDIA కూటమి అధికారంలోకి వచ్చి ఉండేద‌ని చెప్పారు. NDA కూటమి కేవలం 213 సీట్లకే పరిమితమై.. ప్రతిపక్ష హోదాలో ఉండేదన్నారు. కానీ.. ఓటు చోరీతో NDA అదనంగా 79 సీట్లను సొంతం చేసుకొని, అధికారంలోకి వచ్చిందన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *