ఏవీఎన్ లేక్‌ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ అద్భుతం

ప్రైవేట్ స్కూల్ ను ప్ర‌శంసించిన ముఖ్య‌మంత్రి

హైద‌రాబాద్ : ఆయ‌న బాధ్య‌త క‌లిగిన సీఎం . ఓ వైపు ప్ర‌భుత్వ స్కూల్స్ గురించి ప‌ట్టించు కోవాల్సిన అవ‌సరం ఉంది. ఇప్ప‌టికే మౌలిక వ‌స‌తుల స‌దుపాయాలు లేక నానా తంటాలు ప‌డుతున్నాయి. ఈ త‌రుణంలో సీఎంతో పాటు కీల‌క‌మైన విద్యా శాఖ‌ను కూడా చూస్తున్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆయ‌న ఏకంగా హైద‌రాబాద్ లో భారీ ఖ‌ర్చుతో నిర్మించిన ప్రైవేట్ స్కూల్ ను ప్రారంభించారు. ఆపై అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. ఒక బాధ్య‌త క‌లిగిన ప‌ద‌విలో ఉన్న త‌ను ఇలా మాట్లాడ‌టం ప‌ట్ల ప్ర‌జాస్వామిక వాదులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా ఇబ్ర‌హీంప‌ట్నంలో ఏర్పాటు ఏసిన‌ AVN లేక్‌ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ను ప్రారంభించారు రేవంత్ రెడ్డి. ఈ క్యాంపస్ ను గమనిస్తే నా బ్రెయిన్ చైల్డ్ మాదిరిగా ఉందన్నారు.ప్రభుత్వ విద్య పైన మేం ప్రత్యేక దృష్టి పెడుతున్నాం అని చెప్పారు. 100 నియోజక వర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం అని ప్ర‌క‌టించారు. రెండో విడతలో మరిన్ని స్కూల్స్ ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. ఏఐ పరిణామాల నేపథ్యంలో విద్య వ్యవస్థలో మార్పులు చేస్తున్నాం అని తెలిపారు. విద్యార్థులకు కొత్త నైపుణ్యాలను నేర్పించే దిశగా ఆలోచన చేస్తున్నామ‌న్నారు. రేపటి ఉపాధికి అనుగుణంగా విద్య ప్రమాణాలు, అది నేర్పించే నైపుణ్యాలు ఉండాల‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *