కార్తీక మాసం యాదగిరిగుట్ట‌కు భారీ ఆదాయం

VijayaBhaskar · November 22, 2025
Spread the love

రూ. 17 కోట్ల‌కు పైగా హుండీ ఆదాయం

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా : తెలంగాణ రాష్ట్రానికి ఐకాన్ గా పేరు పొందిన ఆల‌యం శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామ కొలువు తీరిన యాద‌గిరిగుట్ట‌. ఈసారి రికార్డు స్థాయిలో స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు విచ్చేశారు భ‌క్తులు. కోరిన కోర్కెలు తీరుతాయ‌ని భ‌క్తుల విశ్వాసం. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హయాంలో కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి దీనిని తీర్చిదిద్దారు. శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ ఇన్న‌జీయ‌ర్ స్వామీజీ ఆధ్వ‌ర్యంలో స్వామి వారి ఆల‌యాన్ని న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో ఆక‌ట్టుకునేలా నిర్మించారు.

ఇదిలా ఉండ‌గా కార్తీక మాసంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయానికి భారీ ఆదాయం స‌మ‌కూరింది. ఈ ఒక్క మాసంలోనే స్వామి వారిని 20 లక్షల 52 వేల మంది భక్తులు ద‌ర్శించుకున్నారు. వీరి ద‌ర్శ‌నం కార‌ణంగా ఏకంగా ఆల‌యానికి 17 కోట్ల 62 లక్షల 33 వేల 331 రూపాయల హుండీ ద్వారా ఆదాయం ల‌భించింది. కాగా గతేడాది ఆదాయం 14 కోట్ల 30 లక్షల 69 వేల 481 రూపాయలు మాత్ర‌మే వ‌చ్చాయి. గతేడాది కంటే 3 కోట్ల 31 లక్షల 63 వేల 850 ఆదాయం స్వామివారి దేవాలయానికి అధికంగా వచ్చిందని వెల్ల‌డించారు ఈవో .