శ్రీ‌వారి ఆల‌య విస్త‌ర‌ణ ప‌నుల‌కు శ్రీ‌కారం

Spread the love

ప్ర‌పంచ వ్యాప్తంగా శ్రీ‌వారి ఆల‌యాలు

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారికి కోట్లాది మంది భ‌క్తులు ఉన్నార‌ని అన్నారు. ఆ స్వామి ద‌య వ‌ల్ల‌నే తాను ఇవాళ మీ ముందు ఉన్నాన‌ని చెప్పారు. లేక పోయి ఉంటే తాను చ‌ని పోయి ఉండేవాడిన‌ని అన్నారు. ఇదిలా ఉండ‌గా గురువారం రాజధాని అమరావతి లోని వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్మించిన శ్రీ వేంకటేశ్వ రస్వామి ఆలయ విస్తరణ పనులకు సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం శంకుస్థాపన చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, రాష్ట్ర దేవాదాయ , ధ‌ర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి, టీటీడీ బోర్డు స‌భ్యుల‌తో పాటు టీటీడీ ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ తో పాటు ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా సీఎం కీల‌క సూచ‌న‌లు చేశారు. కోట్లాది మంది భ‌క్తుల కొంగు బంగారంగా తిరుమ‌ల కొన‌సాగుతోంద‌న్నారు. తాము వ‌చ్చాక కీల‌క మార్పులు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. భ‌క్తుల‌కు మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. దేశంలోని ప్ర‌తిప్రాంతంలో టీటీడీ ఆల‌యాలు నిర్మించాల‌ని కృత నిశ్చ‌యంతో ఉన్న‌ట్లు తెలిపారు.

  • Related Posts

    మే నెలలో శ్రీ గోవిందరాజ స్వామి విశేష ఉత్స‌వాలు

    Spread the love

    Spread the loveఆల‌యంలో మే 1 నుంచి 31వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హ‌ణ తిరుప‌తి : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. మే 1న శ్రీ…

    శ్రీవారికి బంగారు పతకాలు విరాళం

    Spread the love

    Spread the loveవీటి విలువ రూ. 94.80 ల‌క్ష‌లు తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం బెంగుళూరుకు చెందిన డాక్టర్ ఎం.మహదేవమ్మ రూ.94.80 లక్షలు విలువైన 753 గ్రాములున్న 7 బంగారు పతకాలను విరాళంగా అందించారు. ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *