newsseals.com
News

కేసీఆర్ వ‌ల్లే కాక‌తీయ మెగా టెక్స్ టైల్ పార్కు

VijayaBhaskar November 27, 2025
Spread the love

ఏర్పాటైంద‌న్న బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

వ‌రంగ‌ల్ జిల్లా : కేసీఆర్ వ‌ల్ల‌నే వ‌రంగ‌ల్ జిల్లాలో కాక‌తీయ మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అర్ధం అయింద‌ని, కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, బాధ పడేది లేదు భయపడేది అంత కన్నా లేదన్నారు. పరిపాలన చేతకాక అక్రమ కేసులు పెడుతున్నార‌ని ఆరోపించారు. ఉద్యమంలో ఎలా ముందు ఉన్నారో ఇప్పుడు కూడా న్యాయవాదులు ముందు ఉంటున్నారని వారికి ధన్య‌వాదాలు తెలియ చేస్తున్నాన‌ని అన్నారు కేటీఆర్. కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును నిర్మించడం జ‌రిగింద‌ని చెప్పారు.

ఆజామ్ జాహి మిల్లు మూతపడి బతుకు దెరువు కోసం వెళ్ళిన వాళ్ళు వరంగల్ కు రావాలని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును నిర్మించారని గుర్తు చేశారు. కంపెనీలు రావ‌డం వ‌ల్ల పెద్ద ఎత్తున యువ‌త‌కు ఉపాధి ల‌భిస్తోంద‌న్నారు. బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించారని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పిస్తామంటూ మాయ మాట‌లు చెప్పార‌ని, చివ‌ర‌కు బీసీల‌ను మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ విషయంలో ఐదు రకాలుగా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం 160 కోట్లు ఖర్చుపెట్టారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.