రాజ‌ధాని రైతుల‌కు స‌ర్కార్ ఆలంబ‌న

VijayaBhaskar · November 28, 2025
Spread the love

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు . కీల‌క స‌మీక్ష చేప‌ట్టారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతుల కల్పనపై ప్ర‌ధానంగా చ‌ర్చించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి పి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. ఇప్ప‌టికే రైతుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ప్ర‌త్యేకంగా క‌మిటీ ఏర్పాటు చేశామ‌న్నారు సీఎం. ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు.

ఏ ఒక్క రైతుకు అన్యాయం జ‌ర‌గ‌నీయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. రాజధాని ల్యాండ్ పూలింగ్ కు లంక భూమలు ఇచ్చిన రైతుల సమస్య పరిష్కారం అవుతుంద‌ని భ‌రోసా ఇచ్చారు. త్వ‌రిత‌గ‌తిన వారికి న్యాయం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతుల ప్లాట్ లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైందని చెప్పారు సీఎం. లంక భూములిచ్చిన రైతులు తమ రిటర్నబుల్ ప్లాట్ లను రిజిస్ట్రేషన్ చేయించు కోవచ్చని సూచించారు. ఆయా గ్రామాలకు సంబంధించిన యూనిట్ ఆఫీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌకర్యం కల్పించడం జ‌రిగింద‌ని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు.