పల్లెల రూపురేఖలు మారుస్తున్నాం : ప‌వ‌న్ క‌ళ్యాణ్

Spread the love

జెన్ జి తో యువ‌త ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌చ్చింది

అమ‌రావ‌తి : జెన్ జి తో యువ‌త ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌చ్చిందని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. అబద్దపు హామీలుతో ప్ర‌జ‌ల‌ను ఎల్ల‌కాలం మోసం చేయలేమన్నారు బీహార్ ఎన్నికల్లో లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపినా ఆర్జేడిని ఓడించారని అన్నారు. మునుపటి తరంతో పోల్చుకుంటే జెన్ జి యువత చాలా భిన్నం అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తామంటే కుదరదు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని చేసి చూపించాలి, అంతే కాదు ఉపాధి కల్పించాలన్నారు. సంక్షేమ పథకాలు తగ్గి ఉపాధి అవకాశాలు మెరుగైతేనే నిజమైన అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని చెప్పారు డిప్యూటీ సీఎం. ఎక్కువ శాతం ప్రజలు సంక్షేమం అవసరం లేని పరిస్థితిలో ఉండాలి. వాళ్ల స్వయం శక్తి మీద నిలబడే పాలసీలు తీసుకు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఆ దిశగానే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. నిధులు లేకపోయినా, ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా వేల కిలోమీటర్ల రోడ్లు వేస్తున్నాం అన్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల‌.

ఆరు నూరైనా స‌రే అష్ట క‌ష్టాలు ప‌డి పల్లెల రూపురేఖలు మారుస్తున్నాం అన్నారు. సగటు మనిషి కోరుకుంటున్న అభివృద్ధి దిశగా ఆలోచన చేస్తున్నాం అని చెప్పారు. సంపద సృష్టించ గలిగితే రాష్ట్రం నుంచి వలసలు వెళ్లే అవసరం ఉండద‌న్నారు. నేను కోరుకుంటున్నది స్వయం శక్తి మీద నిలబడే భారతదేశం కావాలి. ఎవరికి తలవంచని యువ భారతం కోరుకుంటున్నానని అన్నారు. పర్యాక ప‌రంగా చూస్తే కోనసీమ కేరళ స్థాయికి ఉన్న‌ శక్తి, సత్తా ఉంద‌న్నారు డిప్యూటీ సీఎం. ఇక్కడ బ్యాక్ వాటర్ తో కేరళ తరహా టూరిజాన్ని అభివృద్ధి చేయవచ్చన్నారు. మన దర్శక, నిర్మాతలు షూటింగులకు ఎక్కడో తమిళనాడు, కేరళకు వెళ్తుంటారని, కోనసీమ అందాలు అంతకు మించి ఉంటాయన్నారు. ఈ అందాన్ని మాటల్లో వర్ణించలేమన్నారు. ఇక్కడి యువతలో ఎంతో తెగింపు ఉంటుందన్నారు. వీటన్నింటిని సరైన మార్గంలో పెడితే వేలాది మందికి ఉపాధి కల్పించ వ‌చ్చ‌ని చెప్పారు.

  • Related Posts

    స‌ముద్ర విహారాన్ని ప్రోత్స‌హించేలా చూడాలి

    Spread the love

    Spread the loveకీల‌క ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క సూచ‌న‌లు చేశారు ఏపీ ప‌ర్యాట‌క రంగంపై.సముద్ర విహారాన్ని ప్రోత్సహించేలా విశాఖ, నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టుల నుంచి క్రూజ్ నౌకలను…

    సింగ‌పూర్ ప్ర‌తినిధుల‌తో మంత్రి అచ్చెన్న భేటీ

    Spread the love

    Spread the loveవ్య‌వ‌సాయ రంగంలో కీల‌క మార్పులు తీసుకు వ‌స్తాం విజ‌య‌వాడ : ఏపీ రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగానికి సంబంధించి స‌మూల మార్పులు తీసుకు వ‌చ్చేలా ప్ర‌య‌త్నం చేస్తోంది కూట‌మి స‌ర్కార్. ఈ సంద‌ర్బంగా వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *