Saturday, 17 October 2026

అశ్వ వాహనంపై అభయ మూర్తి శ్రీరాముడు

newsseals-AshwaVahanam

బ్రహ్మూత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతం

తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా ఎనిమిదో రోజు రాత్రి స్వామి వారు అశ్వ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణ యజుర్వేదం తెలియజే సింది. స్వామి అశ్వ వాహనాధిరూఢడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని నామ సంకీర్తనాద్యు పాయాలను ఆశ్రయించి తరించమని ప్రబోధిస్తున్నాడు.

వాహ‌న సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, డెప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ సురేష్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *