క‌ల్తీ నెయ్యి కేసులో మ‌రో 11 మంది

VijayaBhaskar · November 29, 2025
Spread the love

నిందితుల‌ను చేర్చిన సిట్

అమ‌రావ‌తి : దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన తిరుమ‌ల క‌ల్తీ నెయ్యి కేసులో రోజు రోజుకు ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఈ కల్తీ నెయ్యి కేసులో మరో 11 మంది నిందితులను చేర్చింది ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం( సిట్ ) . దీంతో మొత్తం నిందితుల సంఖ్య 35కి చేరింది; నెల్లూరు ఎసిబి కోర్టులో మెమో దాఖలు చేసింది ద‌ర్యాప్తు బృందం. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు మ‌రికొంద‌రిని చేర్చింది. ఇదిలా ఉండ‌గా గతంలో కేసు నమోదు సమయంలో 15 మందిని, దర్యాప్తు సమయంలో మరో తొమ్మిది మందిని చేర్చింది సిట్.

తాజా చేరికలతో, మొత్తం నిందితుల సంఖ్య ఇప్పుడు 35కి పెరిగింది. నెల్లూరు ఎసిబి కోర్టుకు మెమో సమర్పించబడింది. 2019 నుంచి 2024 మధ్య సేకరణ విభాగంలో పనిచేసిన జనరల్ మేనేజర్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లపై సిట్ కేసులు నమోదు చేసింది. ఇప్పటివరకు, ఈ కేసుకు సంబంధించి 10 మందిని అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. మ‌రో వైపు అప్ప‌టి టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డిని, ఆయ‌న పీఎస్ ను కూడా విచారించింది సిట్. కేసు విచార‌ణ‌లో భాగంగా త‌నను నిన్న నాలుగు గంట‌ల పాటు విచారించ‌డం గ‌మ‌నార్హం.