దేశం గ‌ర్వించ ద‌గిన నాయ‌కుడు వాజ్‌పేయి

Spread the love

ప్ర‌శంసించిన బీజేపీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్

అమ‌రావ‌తి : భార‌త దేశం గ‌ర్వించ ద‌గిన మహోన్న‌త మాన‌వుడు దివంగ‌త ప్ర‌ధాన‌మంత్రి అట‌ల్ బిహారీ వాజ్ పేయి అని అన్నారు ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్. ఆదివారం కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని మండపేటలో భారత రత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించిన దూరదృష్టి, ప్రజాస్వామ్య విలువల పట్ల అచంచల నిబద్ధత, మాటలో మాధుర్యంం , వాజ్‌పేయిని గొప్ప నాయ‌కుడిగా నిల‌బెట్టేలా చేశాయ‌న్నారు.

ఆయన సేవా తపస్సును స్మరించుకుంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేయాలన్న సంకల్పం పునరుద్ఘాటించామ‌ని అన్నారు పీవీఎన్ మాధ‌వ్. ఆయ‌న అందించిన సేవ‌లు ఎప్ప‌టికీ , ఎల్ల‌ప్ప‌టికీ నిలిచే ఉంటాయ‌న్నారు. ఈ దేశంలో కీల‌క‌మైన ర‌హ‌దారుల నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టింది త‌న హ‌యాంలోనేన‌ని గుర్తు చేశారు పీవీఎన్ మాధ‌వ్. ఈ కార్య‌క్ర‌మంలో రాజ‌మండ్రి ఎంపీ పురందేశ్వ‌రి, ఎమ్మెల్యే న‌ల్ల‌మ‌ల్లి రామ‌కృష్ణా రెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ తో పాటు బిజెపి నాయకులు పాల్గొన్నారు.

  • Related Posts

    కాముని చెరువు పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాలి

    Spread the love

    Spread the loveఆదేశించిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : మూసాపేట‌లోని కాముని చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సంద‌ర్శించారు. రెండో విడ‌త చేప‌డుతున్న 14 చెరువుల్లో కాముని చెరువు కూడా ఉంద‌నే విష‌యం విధిత‌మే. ఈ చెరువు…

    జీవ‌న్ రెడ్డిని బుజ్జ‌గించిన టీపీసీసీ చీఫ్

    Spread the love

    Spread the loveత‌న‌ను క‌లిసిన విప్ ఆది శ్రీ‌నివాస్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ , విప్ ఆది శ్రీ‌నివాస్.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *